Skip to main content

Medical College : అనంత‌పురం వైద్య క‌ళాశాల‌కు 'ఏ' గ్రేడ్‌..

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి న్యూరో సర్జరీ విభాగానికి నాలుగు ఎంసీహెచ్‌ (సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్య కోర్సు) సీట్లు కూడా మంజూరయ్యారు.
A grade for ananthapuram government medical college

అనంతపురం మెడికల్‌: అనంతపురం వైద్య కళాశాలకు ఏ గ్రేడ్‌ లభించింది. ఈ క్రమంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి న్యూరో సర్జరీ విభాగానికి నాలుగు ఎంసీహెచ్‌ (సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్య కోర్సు) సీట్లు కూడా మంజూరయ్యారు. ఈ మేరకు జాతీయ వైద్య మండలి నుంచి ధ్రువీకరణ పత్రం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాణిక్యరావుకు అందింది. దీంతో మంగళవారం వైద్య కళాశాలలో సంబరాలు నిర్వహించారు.

TTD: గెస్ట్‌ ఉపాధ్యాయుల కోసం ఇంటర్వ్యూలు

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వర రావు, సంబంధిత విభాగ వైద్యులతో కలిసి ప్రిన్సిపాల్‌ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యూరో సర్జరీ విభాగానికి పీజీ సీట్లు మంజూరు కావడం శుభపరిణామమన్నారు. ఇప్పటికే రూ.లక్షలు విలువ చేసే సర్జరీలు ఉచితంగా చేస్తున్నారన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

పీజీ సీట్ల మంజూరుతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. వైస్‌ ప్రిన్సిపాళ్లు కేఎల్‌ సుబ్రమణ్యం, నవీన్‌, షారోన్‌ సోనియా, షంషాద్‌బేగం, తెలుగు మధుసూదన్‌, న్యూరో సర్జరీ విభాగాధిపతి భాస్కర్‌ మాట్లాడుతూ ఎంసీహెచ్‌ సీట్ల మంజూరుతో పాటు కళాశాలకు ఏ గ్రేడ్‌ రావడంలో ప్రిన్సిపాల్‌ కీలకపాత్ర పోషించారని కొనియాడారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

కార్యక్రమంలో ఎన్‌ఎంసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రత్యేక చొరవతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే వైద్య కళాశాలలో వివిధ విభాగాలకు సంబంధించి 300 వరకు పీజీ, యూజీ సీట్లు మంజూరు కాగా, తాజాగా సూపర్‌ స్పెషాలిటీకి కూడా ఎంసీహెచ్‌ సీట్లు కేటాయించడం గమనార్హం.

KU: సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

Published date : 30 Oct 2024 05:10PM

Photo Stories