Skip to main content

IAS Officer Success Story : అప్పుచేశా.. ఐఏఎస్ కొట్టా.. కార‌ణం ఇదే..

ఒక సాధార‌ణ మధ్య‌ తరగతి కుటుంబానికి చెందిన ఓ యువ‌కుడు.. అతని తండ్రి పడిన కష్టానికి ప్రతి ఫలం దక్కేలా చేసుకున్నాడు. ప‌ట్టుద‌ల‌ ఉంటే.. ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించాడు.
Satyam Gandhi IAS Success Story
Satyam Gandhi IAS Success

తొలి ప్రయత్నంలో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే సివిల్స్‌లో విజ‌యం సాధించడమే గొప్ప అనుకుంటే.. అలాంటిది దేశ వ్యాప్తంగా 10వ ర్యాంకు సాధించాడు ఈ యువకుడు. ఈ యువ‌ ఐఏఎస్ పేరు సత్యం గాంధీ. ఈ నేప‌థ్యంలో అపూర్వ‌మైన విజ‌యం సాధించిన యువ ఐఏఎస్ ఆఫీస‌ర్ సత్యం గాంధీ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

☛ IAS Success Story : జీవితాన్ని ఇలా చూస్తే.. ఏదైనా ఈజీనే.. ఫెయిల్ అయితే..

కుటుంబ నేప‌థ్యం :

Satyam Gandhi IAS Family

సత్యం గాంధీ.. బీహార్‌లోని సమస్తిపూర్‌లో దిఘరా గ్రామానికి చెందిన వారు. తండ్రి అఖిలేష్ కుమార్. తల్లి మంజు కుమారి. ఈమె గృహిణి. అతని తాత సచ్చిదానంద రాయ్ ఒక సాధార‌ణ‌ రైతు. తమ్ముడు శివం గాంధీ. చండీగఢ్‌లో బీపీఎస్ చదువుతున్నాడు.

☛ IAS Success Story : ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్.. చివ‌రికి ఐఏఎస్‌ కొట్టానిలా..

ఎడ్యుకేష‌న్ :

IAS  Satyam Gandhi Education Details

సత్యం గాంధీ.. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయం పూసాలో చదివాడు. 2017లో గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు. 2020లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ దయాళ్ సింగ్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వారు.

☛➤ Poorna Sundari IAS Success Story : కంటి చూపు లేకపోతే ఏమి.. ఆత్మ విశ్వాసం ఉంటే చాలు క‌దా.. ఆడియోలో వింటూ.. ఐఏఎస్ కొట్టానిలా..

కొడుకు చ‌దువు కోసం తండ్రి..:

IAS  Satyam Gandhi father

సత్యం గాంధీ.. చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకు. కానీ.. అతనిది మధ్య తరగతి కుటుంబం. ఉన్నత చదువులు చదివించేందుకు అతని తండ్రి వద్ద కనీసం డబ్బులు కూడా ఉండేవి కావు. అయితే.. దాని కోసం కొడుకు భవిష్యత్తును ఆపేయాలని అనుకోలేదు. బ్యాంకులో లోను తీసుకొని మరీ.. కొడుకును చదివించాడు. తండ్రి కష్టాన్ని ఆ కొడుకు కూడా ఊరికే పోనివ్వలేదు. చాలా కష్టపడి చదివాడు. యూపీఎస్సీ సివిల్స్‌లో 10 ర్యాంక్ సాధించి.. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాడు. మద్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు.. అతని తండ్రి పడిన కష్టానికి ప్రతి ఫలం దక్కేలా చేశాడు. 

☛➤ IAS Success Story : కూలీనాలీ చేస్తూ చ‌దివాడు.. ఐఏఎస్ సాధించాడు.. కానీ ఈయ‌న పెళ్లి మాత్రం..

సివిల్స్‌లో ప్రిప‌రేష‌న్ కోసం..

IAS  Satyam Gandhi upsc preparation plan

సత్యం గాంధీ.. గ్రాడ్యుయేషన్ కోసం సొంత ఊరిని విడిచి ఢిల్లీకి వెళ్లాడు. త‌న ల‌క్ష్య‌సాధ‌న‌పై ఎప్పుడు ఒక స్పష్టంమైన అవ‌గాహ‌న‌తో ఉండే వారు. ఎలాగైన త‌న లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయంతో ముందుకు సాగారు. కాలేజీ మూడో సంవత్సరం నుంచే.. యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాడు. సిలబస్‌ని అర్థం చేసుకుని, మంచి మెటీరియల్‌ని ఎంచుకుని, ఒక ప్లాన్ ప్ర‌కారం చదవడం ప్రారంభించాడు. చదువుకు ఆటంకం కలగకూడదని పెళ్లి వేడుకలు, అనవసరమైన వాటికి దూరంగా ఉండేవారు. అలాగే స్నేహితుల సర్కిల్‌లతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండేవాడు.

☛ UPSC Civils Ranker Success Story : విధికే సవాలు విసిరా.. 22 ఏళ్లకే సివిల్స్ కొట్టానిలా..

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రయాణం చాలా..
యూపీఎస్సీ (UPSC) ప్రయాణం చాలా శ్రమ, సవాళ్ల‌తో కూడుకున్నద‌న్నారు. ఊరు వదిలి సిటీకి వెళ్లి చదువుకున్నాడు. నగర సంస్కృతి, గ్రామీణ ప్రాంతాల సంస్కృతికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఆ పరిస్థితులకు అలవాటు పడటానికి తనకు కొంత సమయం పట్టిందన్నారు.

☛➤ IPS Anjali Success Story : అంజలి విశ్వకర్మ.. ఐపీఎస్ స‌క్సెస్ స్టోరీ.. నా వెనుక ఉన్న‌ది వీళ్లే..

ఆర్థిక పోరాటంలో..

IAS  Satyam Gandhi Story in telugu

తన కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారని సత్యం చెప్పారు. చదువు కోసం నిత్యం బ్యాంకులో రుణం తీసుకునేవారు. అప్పు చేసి చదువుకున్నట్లు. కుటుంబ సభ్యులకు కూడా మంచి ఉన్న‌త అధికారి కావాలని కలలు కనేవారు. ఆ కల ఇప్పుడు నెరవేరింది. తన జీవితంలో ప్రత్యేకమైన పోరాటం జరగలేదని, అయితే కొంత ఆర్థిక సమస్య ఎదురైందన్నారు. అందుకే నేను కాలేజ్ చదువుతో పాటు సెకండ్ ఇయర్‌లో కూడా కాస్త డబ్బు సంపాదించే పనిలో ప‌డ్డాను.

➤☛ Inspirational Success Story : నిజంగా.. ఈ క‌లెక్ట‌ర్ స్టోరీ మ‌న‌కు క‌న్నీరు పెట్టిస్తోంది..

నా విజ‌యంతో వీరిదే కీల‌క పాత్ర‌..

ias success story

తన విజయంలో తన తండ్రి అఖిలేష్ కుమార్, తల్లి మంజు కుమారి కీల‌క పాత్ర పోషించార‌న్నారు. అలాగే నా విజయంలో స్నేహితులు, ఉపాధ్యాయులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు.

నాకు ఇష్ట‌మైన‌వి ఇవే..
సత్యం గాంధీ ఐఏఎస్ కాకపోతే ఏం జరిగేది..? ఈ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. నేను అనుకున్న ల‌క్ష్యం తీరే వ‌ర‌కు మ‌ళ్లి మ‌ళ్లీ ప్రయత్నిస్తానన్నారు. సినిమా నిర్మాణం, ఫోటోగ్రఫీ, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. నా సివిల్స్‌ ఇంటర్వ్యూ దాదాపు 20 నిమిషాలపాటు సాగిందన్నారు.

☛ జీవితంలో కష్టాలు రావడం కూడా అదృష్టమే.. ఈ ఐపీఎస్ స్టోరీ చ‌దివితే..మీకే తెలుస్తుంది..

Published date : 19 Apr 2023 01:42PM

Photo Stories