Inspirational Success Story : నిజంగా.. ఈ కలెక్టర్ స్టోరీ మనకు కన్నీరు పెట్టిస్తోంది..
ఈమె కాసేపు అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో.. అక్కడ ఒక సన్నని అమ్మాయి నుంచి కలెక్టర్ ఒక ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది. తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. ఇంతకి ఆ విద్యార్థిని అడిగిన కొశ్చన్ ఎంటంటే..మేడమ్, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు?
☛ జీవితంలో కష్టాలు రావడం కూడా అదృష్టమే.. ఈ ఐపీఎస్ స్టోరీ చదివితే..మీకే తెలుస్తుంది..
ఈ విద్యార్థిని ప్రశ్నకు సమాధానంగా చెప్పుతూ..
ఆ కలెక్టర్ నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది. మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఎప్పటికీ ఒక్క మాటలో సమాధానం చెప్పలేని విషయం. దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి. నా జీవిత స్టోరీ కోసం పది నిమిషాలు సమయం కేటాయిస్తానంటే కచ్చింగా నాకు తెలియజేయండి. సిద్ధమే అన్నట్టు స్పందన వచ్చింది.
☛ IPS Success Story : ఇంట్లో చెప్పకుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
నా కుటుంబ నేపథ్యం..
నా పేరు రాణి, సోయామోయి నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని. నేను జార్ఖండ్‌లోని గిరిజన ప్రాంతంలో పుట్టాను. కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది. కోడెర్మా జిల్లాలోని “మైకా” గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో నేను పుట్టాను. మా నాన్న, అమ్మతో పాటు నాకు ఇద్దరు అన్నలు, ఒక చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవారం. వేరే ఉద్యోగం దొరక్కపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసే వారు. ఈ పని చాలా దారుణంగా ఉంటుంది. నాకు 4 సంవత్సరాల వయసులో మా నాన్న, అమ్మ, ఇద్దరు అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచంలో ఉన్నారు. గనుల్లోని ప్రాణాంతక మైకా ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో మాకు ఎవరికీ తెలియదు.
☛ IPS Success Story : నన్ను విమర్శించిన వారే.. ఇప్పుడు తలదించుకునేలా చేశానిలా..
మా అన్నలు ఇద్దరు అనారోగ్యంతో..
నాకు ఐదేళ్ల వయసులో మా అన్నలు ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు. చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి, రుమాలుతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు.., ఒకటి లేదా రెండు రోటీలు ఉంటాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యం ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా..?
ఆ రోజు జీవితంలో మొదటి సారి కడుపు నిండా..
ఒకరోజు ఆకలితో.. ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పనికోసం వెళ్ళాను. కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని. అది ఒక పురాతన గని. తవ్వి.. తవ్వి.. పాతాళం వరకు విస్తరించింది. దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్లి మైకా ఖనిజాలను సేకరించడం నా పని. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమైయ్యేది. నా జీవితం లో మొదటి సారి కడుపు నిండా రోటీలు తిన్నాను. కానీ ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్‌లో ఉండాల్సిన సమయంలో, నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండచరియలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవడం, అప్పుడ ప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవడం అక్కడ సర్వసాధారణం.
☛ Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేరయ్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..
కానీ విధి మరో రూపంలో..
రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించవచ్చు. ప్రతిరోజు విషపూరిత వాయువులను పీల్చడం, ఆకలి కారణంగా నేను సన్నగా మారాను. ఒక సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్లడం ప్రారంభించింది. అలా నాన్న, అమ్మ, చెల్లి, నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలం అనే స్థితికి వచ్చాము. కానీ విధి మరో రూపంలో మమ్ముల్ని వెంటాడడం ప్రారంభించింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్ళనప్పుడు, అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్‌లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి ఉన్నారు. కలెక్టర్ రాణికి రెండు కళ్లలోనూ కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు. చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు నాకు ఆరేళ్లు మాత్రమే.
☛ Success Story : నలుగురు తోబుట్టువుల్లో.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఒక ఐపీఎస్.. వీరి సక్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే..
ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ..
చివరికి ప్రభుత్వ అనాధ ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నేను చదువుకున్నాను. నేను నా మొదటి వర్ణమాలలను మా గ్రామం నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు కలెక్టర్ గా మీ ముందు ఉన్నాను. నేను మేకప్ వాడక పోవడానికి దీనికి మధ్య సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది. ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకొనే సమయంలోనే తెలుసుకున్నాను. మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్‌లలో, 20,000 మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ-రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది.
ఎంతోమందిని బలిగొన్న.., నలిగిన పిల్లల చేతుల నుంచి వచ్చి మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మేకప్‌ను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపునిండా ఎలా తినగలను? ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలు ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో, కళ్లలోని కన్నీళ్లు తుడుచు కోకుండా, తల నిమురుతూ వెళ్లిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు. అందుకే ఈ కలెక్టర్ స్టోరీ అందరికి కన్నీరు పెట్టిస్తుంది. ఈ కలెక్టర్‌కు మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే...