IAS Officer Success Story : నాన్న నిర్లక్ష్యం.. అన్న త్యాగం.. ఇవే నన్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయ్.. కానీ
సివిల్స్ టార్గెట్‌గా పెట్టుకున్న ఆ యువకుడు, ఇప్పుడు భారతదేశంలో అతి చిన్న వయసులోనే ఐఏఎస్‌గా ఎంపికయ్యి రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఈ ఆటో డ్రైవర్ కొడుకు సివిల్స్ ఎలా కొట్టాడు? ఎలా ప్రిపేర్ అయ్యాడు? సక్సెస్ కోసం ఎలాంటి ప్లాన్ వేశాడు? మరి అతను ఇంత చిన్న వయసులోనే ఎలా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు? మొదలైన వివరాలు మీకోసం..
IPS Success Story : ఇంట్లో చెప్పకుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
కుటుంబ నేపథ్యం :
షేక్ అన్సార్.. మహారాష్ట్రలోని జాల్నా గ్రామానికి చెందిన వారు. అన్సార్ తండ్రి యోనస్ షేక్ అహ్మద్ ఓ ఆటోడ్రైవర్. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఆటో నడుపుతారు. ఆయన మద్యానికి బానిసయ్యాడు. అంతేకాదు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడు. అన్సార్.. రెండో భార్య కొడుకు. అతని తల్లి పొలం పనులు చేస్తుంది. అన్సార్ షేక్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల మధ్య పెరిగాడు. చిన్నప్పటి నుంచి అతను గృహ హింసను చూస్తూ పెరిగాడు. అలాగే బాల్య వివాహాల్ని కళ్లారా చూశాడు. అతని సోదరీమణులకు కూడా 15 ఏళ్లకే పెళ్లైపోయింది.
IAS Success Story: మారుమూల పల్లెటూరి యువకుడు.. ఐఏఎస్ కొట్టాడిలా..
ఎడ్యుకేషన్ :
అన్సార్ చిన్ననాటి రోజుల్లో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండేది కాదు. దీంతో అతడిని బడి మానిపించాలని తండ్రి నిర్ణయించుకున్నారు. కానీ ఆ స్కూల్ టీచర్ ఆయనకు నచ్చజెప్పారు. అన్సార్ చాలా బాగా చదువుకుంటాడని, అతడికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఆమె మాటలు విన్న తండ్రి ఏం చేయలేక అతడి చదువును కొనసాగించేందుకు ఒప్పుకున్నారు. అయితే కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా అన్సార్ సోదరుడైన అనీస్ ఏడో తరగతిలోనే స్కూల్ మానేసి.. గ్యారేజీలో పనికి చేరాడు. తద్వారా కుటుంబానికి సాయపడుతూ.. అన్సార్.. సివిల్స్ చదివేందుకు వీలు కల్పించాడు. తన అన్న తన కోసం చేస్తున్న త్యాగం.. అన్సార్‌లో ప్రేరణను రగిలించింది. కచ్చితంగా సివిల్స్ కొట్టాలనే పట్టుదలను పెంచింది.
Success Story : ఈ జవాన్.. చివరికి ఐఏఎస్ కొట్టాడిలా.. నా ఆరాటం..పోరాటం ఇదే..
తర్వాత కొద్దిరోజుల తర్వాత తిరిగి ఎడ్యుకేషన్ కొనసాగించారు. అలాగే అన్సార్ 12వ తరగతి బోర్డు పరీక్షలలో 91 శాతం మార్కులు సాధించాడు. తర్వాత పూణేలోని ఫెర్గూసన్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో 73 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన ఆర్థిక అవసరాలను తీర్చుకోడానికి కష్టమైన ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత యూపీఎస్సీ సివిల్స్‌ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు.
సివిల్స్ కోసం.. ఎన్నో..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌కు సిద్ధమవుతున్నప్పుడు వరుసగా మూడు సంవత్సరాలు ప్రతిరోజూ సుమారు 12 గంటలు కష్టపడ్డానని చెప్పారు అన్సార్. కాలేజీ తర్వాత ఒక సంవత్సరం పాటు యూపీఎస్‌సీ సివిల్స్‌కు కోచింగ్‌లో చేరాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన వాడని తెలిసి ఆ కోచింగ్ సెంటర్ కూడా ఫీజులో కొంత భాగాన్ని మాఫీ చేసింది. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న ఈ టాలెంట్ పర్సన్.. 2015 యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించాడు. అప్పటికి అతని వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. కొత్త కలల ప్రపంచంలోకి సగర్వంగా అడుగుపెట్టాడు.
Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేరయ్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..
నా తండ్రిని చూసిన ప్రతిసారీ.. నాలో..
ఈయన దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఫ్యామిలీలో చదువుకున్న వాళ్లు ఉంటేనే సివిల్స్ కొట్టగలరు అనే అభిప్రాయం తప్పు అని అతను నిరూపించాడు. తన తండ్రిని చూసిన ప్రతిసారీ అన్సార్‌లో.. నేను మాత్రం నా తండ్రిలా అవ్వకూడదు అనే పట్టుదల పెరిగింది. చుట్టుపక్కల వాతావరణం నుంచి అతనిలో పెరిగిన పట్టుదలే అతన్ని సివిల్స్ కొట్టేలా చేసింది.
➤ Success Story : ఎలాంటి ఒత్తిడి లేకుండా సివిల్స్ కొట్టానిలా.. నా రికార్డును నేనే..
ఇప్పటి వరకు ఆయన రికార్డును..
దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు అన్సార్. ఇప్పటి వరకు ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారంటే అదెంత కష్టమైన రికార్డో అర్థం చేసుకోవచ్చు. కష్టాలు, సమస్యల గురించి ఆలోచించకుండా లక్ష్యంపై గురిపెడితే, ఎవరైనా సక్సెస్ అవుతారని చెబుతున్నారు అన్సార్.
విజయానికి అడ్డదారులు లేవ్.. నేను మాత్రం..
అలాగే హార్డ్ వర్క్, సరైన గైడెన్స్ వంటివి యూపీఎస్సీ సివిల్స్‌లో విజయం సాధించేందుకు కీలకం అవుతాయన్నారు. విజయానికి అడ్డదారులు లేవు. నేను కష్టపడుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ సాయం చేశారు. మానసికంగా, ఆర్థికంగా ఆదుకున్నారు. నా కోచింగ్ అకాడెమీ సైతం.. నా పేదరికాన్ని చూసి ఫీజులో కొంత రాయితీ ఇచ్చింది అని అన్సార్ తెలిపాడు.
మీరు లక్షల మందితో పోటీ పడుతున్నామని అనుకుంటే అది పొరపాటే. మీకు మీరే పోటీ అని గుర్తించండి. మీలోని నెగెటివ్ భావాలన్నీ పూర్తిగా తొలగించండి. విజయం మీ వశం కావాలని కలలుకనండి అని కొత్త అభ్యర్థులకు తన సందేశం ఇచ్చాడు అన్సార్. ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఈ యువ ఐఏఎస్ స్టోరీ ఒక మంచి ప్రేరణ కలిగించే అంశంగా చెప్పవచ్చును.
ఏ చదువు చదివినా..
మన దేశంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న, అతి కష్టమైన పోటీ పరీక్షల్లో ఒకటిగా నిలుస్తున్నాయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షలు. చాలా మంది యువత.. ఏ చదువు చదివినా.. సివిల్స్ కొట్టాలని కలలు కంటారు. కొందరు వాటిని సాధిస్తారు. కొందరు ప్రిలిమ్స్ దగ్గరే ఆగిపోతుంటారు. కొందరు ఇంటర్వ్యూని సరిగా అటెంప్ట్ చెయ్యలేరు. కొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుల లాగా.. చివరి వరకూ పోరాడి విజయం సాధిస్తారు.