Success Story : నలుగురు తోబుట్టువుల్లో.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఒక ఐపీఎస్.. వీరి సక్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే..
వీరంతా ఒకే కుటుంబంలో ఒకే తండ్రికి జన్మించిన పిల్లలు. ఈ నేపథ్యంలో ఈ నలుగురి సక్సెస్ స్టోరీలు మీకోసం..
☛ Success Story: నాడు పశువులకు కాపల ఉన్నా.. నేడు దేశానికి కాపల కాసే ఉద్యోగం చేస్తున్నా.. ఇందుకే..
కుటుంబ నేపథ్యం :
వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌లో ఉంది. వారి తండ్రి అనిల్ ప్రకాష్ మిశ్రా. గ్రామీణ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నారు. ఈయన ఒక గ్రామీణ బ్యాంకు మేనేజరు అయినప్పటికీ తన పిల్లల చదువు విషయంలో ఏనాడూ రాజీపడలేదు. వారికి మంచి ఉన్నత విద్యను అందించేదుకు నిరంతరం కృషి చేశారు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని, ఆయనతో పాటు తమ కలలను సాకారం చేసుకునేలా కష్టపడి చదివారు.
మొదటి కుమారుడు మాత్రం..
తండ్రి కష్టాన్నికి ఫలితంగా ఈయన మొదటి కుమారుడు యోగేష్ మిశ్రా సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ అధికారి ఉద్యోగం సాధించారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన ఈయన గత 2013లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష రాసి తన తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
రెండో కుమార్తె మాత్రం..
రెండో కుమార్తె క్షమా మిస్రా. మొదటి మూడు ప్రయత్నాలు విఫమైనప్పటికీ నాలుగోసారి మాత్రం విజయం సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. మూడో కుమార్తె మాధురి మిశ్రా. పీజీ పట్టభద్రురాలైన ఈమె 2014లో జరిగిన యూపీఎస్సీ పరీక్షరాసి విజయం సాధిచి జార్ఖండ్ విభాగంలో ఐఏఎస్‌గా పని చేస్తున్నారు.
☛ IAS Officer Success Story : నాన్న డ్రైవర్.. కూతురు ఐఏఎస్.. చదవడానికి డబ్బులు లేక..
ఇక నాలుగో కుమారుడు..
నాలుగో కుమారుడు లోకేష్ మిశ్రా ప్రస్తుతం బీహార్ ఐఏఎస్ క్యాడెర్ అధికారిగా పని చేస్తున్నారు. ఈయన 2015లో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధిచారు. జాతీయ స్థాయిలో 44వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
నా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని..
గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా ఉన్న వారి తండ్రి అనిల్ ప్రకాశ్ మిశ్రా మాట్లాడుతూ.. నేను గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా ఉన్నప్పటికీ నా పిల్లల చదువుల నాణ్యతతో నేను ఎప్పుడు రాజీ పడలేదు. నా పిల్లల కు మంచి ఉద్యోగాలు రావాలని నేను కోరుకోన్నాను. వారు చదువులపై దృష్టిసారించారన్నారు.
ఉద్యోగం చేస్తూ..
నలుగురు తో బుట్టువుల్లో పెద్దవాడైన యోగేశ్ మిశ్రా ఐఏఎస్ అధికారి. మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిటెక్ ఇంజనీరింగ్ చేశాడు. అతను నోయిడాలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాడు. 2013లో యుపిఎస్‌సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి అయ్యాడు. సివిల్ సర్వీసెస్‌కు బాగా సిద్దమైన యోగేశ్ మిశ్రా సోదరి క్షమా మిశ్రా మూడుసార్లు సివిల్స్ రాసినప్పటికీ నాలుగోసారి ఉత్తీర్ణ సాధించి ఐపిఎస్ అధికారి అయ్యింది.
మూడో తోబుట్టువు మాధురి మిశ్రా లాల్‌గంజ్‌లోని కళాశాల నుండి గ్రాడ్యేయేషన్ పూర్తి చేసి అలహాబాద్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 2014లో సివిల్స్ పరీక్షలు రాసి జార్ఖండ్ కేడర్‌కు ఐఏఎస్ అధికారి అయ్యారు. అందరి కంటే చిన్న తోబుట్టువు లోకేశ్ మిశ్రా 2015లో సివిల్స్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయ్యాడు.