Success Story : ఒకే కల.. ఒకే స్టడీ మెటిరీయల్ చదువుతూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ ఐఏఎస్ ఉద్యోగం కొట్టారిలా..
అయితే ఇక్కడ ఒకే నోట్స్ చదివిన ఇద్దరు అక్కాచెల్లెలు మాత్రం కలిసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే తమ కలను నెరవేర్చుకున్నారు. అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి విజయం సాధించి ఇద్దరూ ఐఏఎస్ అయ్యారు.
IAS Officer Success Story : నాన్న డ్రైవర్.. కూతురు ఐఏఎస్.. చదవడానికి డబ్బులు లేక..
ఇద్దరు అక్కాచెల్లెల్లు ఒకే నోట్స్ చదివి యూపీఎస్సీ (UPSC) పరీక్షకు సిద్ధమయ్యారు. అక్క 3వ ర్యాంక్ సాధించగా.. చెల్లెలు మాత్రం 21వ ర్యాంక్ కొట్టింది. వీరే ఢిల్లీకి చెందిన అంకితా జైన్, ఆమె సోదరి వైశాలి జైన్. ఈ నేపథ్యంలో అంకితా జైన్, వైశాలి జైన్ సక్సెస్ స్టోరీ మీకోసం..
ఒకే స్టడీ మెటిరీయల్ చదువుతూ..
అంకితా జైన్, ఆమె చెల్లెలు వైశాలి జైన్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు సిద్ధం కావడానికి ఒకే స్టడీ మెటిరీయల్ చదువుకున్నారు. దీంతో పాటు చదువుకునే సమయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రిపరేషన్‌లో సహకరించుకున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష చాలా కష్టతరమైన పరీక్షలలో ఒకటిగా చెబుతారు. ఎందుకంటే దీని కోసం విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది విద్యార్థులు సులభంగా విజయం సాధిస్తారు.
చదువు.. ఉద్యోగం :
అంకిత నాలుగో ప్రయత్నంలో విజయం సాధించింది. 12వ తరగతి తర్వాత అంకిత జైన్ ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పట్టా పొందారు. దీని తర్వాత, ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. కానీ కొంతకాలం తర్వాత ఆమె తన ఉద్యోగం వదిలి యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగం వదిలేసి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ఆమెకు అంత తేలిక కాదు. కష్టపడినా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించి సివిల్ సర్వీస్ కలను నెరవేర్చుకుంది.
అక్క సూచనలతోనే నేను కూడా..
వైశాలి జైన్ తన అక్క అంకితా జైన్ సలహాలు, సూచనలతో మంచి ప్రయోజనం పొందింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో విజయం సాధించింది. అంకిత సహాయంతో ప్రిపేర్ కావడం ద్వారా వైశాలి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020లో 21వ ర్యాంక్ సాధించింది. వైశాలి కూడా ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమైంది.