Success Story : ఈ జవాన్.. చివరికి ఐఏఎస్ కొట్టాడిలా.. నా ఆరాటం..పోరాటం ఇదే..
పట్టుదలతో శ్రమించాలే గానీ విజయం దానంతట అదే వస్తోందని నిరూపించారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి హరిప్రీత్ సింగ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
Lady IPS Officer: తీవ్రవాదుల అడ్డాలో లేడీ ఐపీఎస్..ఈమె చూస్తే...
కుటుంబ నేపథ్యం :
హరిప్రీత్ సింగ్.. సామాన్య కుటుంబానికి చెందిన వారు. ఈయన పంజాబ్‌లోని లుధియానాక చెందినవారు. తండ్రి వ్యాపారం చేస్తుంటారు. తల్లి టీచర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఈయనకు ఒక చెల్లి కూడా ఉన్నారు.
ఎడ్యుకేషన్ :
హరిప్రీత్ సింగ్ గ్రీన్ గ్లోవ్ పబ్లిక్ స్కూలులో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత బీఈ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్స్ చేశారు. ఆ తర్వాత సివిల్స్ కోసం తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. 2016లో యూపీఎస్పీ పరీక్షలు రాయగా బీఎస్ఎఫ్ ఆఫీసర్ క్యాడర్‌గా ఎంపికయ్యారు. ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్‌లో బీఎస్ఎఫ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే.. మళ్లీ సివిల్స్ పరీక్షలకు ప్రిపేరయ్యారు.
Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేరయ్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..
హరిప్రీత్ సింగ్ కల సాకారమైందిలా..
2017లో ఈయన యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష రాశారు. అయితే ఈయనకు సివిల్స్‌లో ఆల్ ఇండియా 454 ర్యాంకు వచ్చింది. దీంతో ఆయన ఐటీఎస్ (ఇండియన్ ట్రేడ్ సర్వీసు) ఎంపికయ్యారు. ఐటీఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోసారి సివిల్స్ రాశారు. అలాగే మరుసటి ఏడాదే ఆల్ ఇండియా 19వ ర్యాంక్ సాధించి.. హరిప్రీత్ కల సాకారం చేసుకున్నాడు.
హరిప్రీత్ సింగ్ సివిల్స్‌కు ఎంపికవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు సివిల్స్ రాసేవారు.. తమ ప్రయత్నాలను నిరంతరం చేస్తూ ఉండాలని సూచించారు. లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నిస్తే విజయం తనంతట అదే వస్తోందని ధీమా వ్యక్తం చేసారు.
➤ Success Story : ఎలాంటి ఒత్తిడి లేకుండా సివిల్స్ కొట్టానిలా.. నా రికార్డును నేనే..