Skip to main content

Lady IPS Officer: తీవ్రవాదుల అడ్డాలో లేడీ ఐపీఎస్..ఈమె చూస్తే...

ఆడదంటే ఇంటి పనులు చూసుకోవాలి...నాజుగ్గా ఉండాలి,సున్నితంగానే ఆలోచించాలి… ఆడవాళ్ళూ పైలట్ లుగా ఏరోనాటికల్ ఇంజినీర్లుగా కూడా ఎదుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఆడపిల్ల అంటే కాస్త అణకువగానే ఉండాలనే భావన పోవటం లేదు.

ఇప్పటికీ ఒకా లేడీ పోలీస్ ఆఫీసర్ అంటే ఒకింత విచిత్రంగానూ,అదె లేడీ హోం గార్డ్ అంటే వెకిలి చూపులూ మనకు సర్వసాధారణమే. ఐతే అన్ని ఉధ్యోగాలూ వేరూ పోలీస్,ఆర్మీ వంటి రక్షణ సంబందమైన సెక్టార్లలో చేసే ఉధ్యోగాలు వేరు...

తొలి ఐపిఎస్ మహిళా అధికారిగా చరిత్ర..
అస్సాంకి చెందిన డాక్టర్ సంజుక్తా పరాశర్.‘ఆడపిల్లకి పోలీసు ఉద్యోగం ఎందుకమ్మా? మరేదైనా రంగంలో ప్రయత్నం చెయ్’ అంటూ ఇంట్లోవాళ్ళు తనని వారించినప్పుడు ఆగిపోలేదామె.తాను ఎప్పటికైనా కిరణ్‌బేడీలా గొప్ప పోలీసు ఆఫీసర్ కావాలని కలలు కనేది.అదె కలని నిజం చేసుకోవటానికి తన సర్వశక్తులూ ఒడ్డి చదివేది, అలా పట్టుదలగా చదివి ఆలిండియాలోనే 85వ ర్యాంక్ సాధించి తన కలలను నిజం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు అస్సాం రాష్ట్రం లోనే లోనే తొలి ఐపిఎస్ మహిళా అధికారిగా చరిత్ర సృష్టించింది.

కుటుంబ నేప‌థ్యం..:
సంజుక్తా తండ్రి దలాల్ చంద్ర బారువా ఇరిగేషన్ శాఖలో ఇంజనీరుగా, తల్లి మీనాదేవి ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు.

చ‌దువు...:
సంజుక్తా ఐపీఎస్ తన చిన్నతనంలో గౌహతిలోని హోలీచైల్డ్ స్కూలులో పదవ తరగతి పూర్థి చేసి ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఉమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ లో చేరింది. గ్రాడ్యుయేషన్ న్లో 80%మార్కులతో పాసైన ఆమె ఆ తర్వాత పిహెచ్‌డి కోసం మద్రాసులోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు)లో చేరింది. చెన్నై లో పిహెచ్‌డి చేస్తున్న దశలోనే ఆమె కఠోర శ్రమ చేసి ఐపిఎస్‌కు ఎంపికైంది.తన సంవత్సరాల కలని ఆమె సాధించింది. అందరూ వద్దు వద్దన్న ఉద్యోగాన్నే సాధించి. తనంత మొండిఘటం లేదని నిరూపించుకుంది. చిన్నప్పటినుంచి తన ఆశయం అయిన ఐపీఎస్ అధికారి హోదా లో తనని తాను చూసుకొని మురిసిపోయింది. ఆడపిల్ల అంటే ఏదో నాజూకు ఉధ్యోగాలు చేయటమే కాదు. వీరత్వాన్ని ప్రదర్శించటం లోనూ తీసిపోనని నిరూపించాలనికోవాలని ఆమె ఐపీఎస్ కి ఎంపికయ్యాను అని తెలిసిన రోజునే అనుకుందట.

అక్క‌డికి వెళ్లోద్ద‌న్న‌ వినిపించుకోలేదు….
ఆమె కోరికకు తగ్గట్టుగానే మొదటి పోస్టింగ్ మకూం లో దొరికింది, బోడో తీవ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉండే ప్రదేశం అది. నిజానికి ఐపీఎస్ శిక్షణ కాలం లో ఆమె ఆత్మ విశ్వాసాన్ని గర్వంగా పొరబడ్డ అధికారులు కావాలనే ఆ ప్రాంతంలో సంజుక్తాకి పోస్టింగ్ ఇచ్చారన్నది ఇంకో మాట. అందుకే శిక్షణ పూర్తయన వెంటనే ఆమెను అసిస్టెంట్ కమాండెంట్‌గా నియమించి, సమస్యాత్మకమైన “మకుం” లో బాధ్యతలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అక్కడ బోడో తీవ్రవాదులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి శరణార్థులుగా ఉన్నవారి మధ్య చిరకాలంగా పోరాటం జరుగుతోంది. ఆ ఉద్రిక్తతలను అణచివేయాలనేది అధికారుల ఆలోచన.ఎన్నో సంవత్సరాలుగా అతి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో “మకూం” ఒకటి. అక్కడికి వెళ్ళే ముందే ఆ ప్రాంతం లోని పరిస్థితులను విన్న ఆమె కుటుంబసభ్యులు మరో సారి సంజుక్తాకు నచ్చ చెప్పి చూసారట కానీ ఆమె వినిపించుకోలేదు….

తిరుగుబాటు దారులు కూడా మెచ్చుకున్న ఏకైక పోలీసాఫీసర్ ఈమె..:
మకూం వెళ్ళీన సంజుక్తా తన విధినిర్వహణను కచ్చితంగా అమలు చేసింది.అక్కడ అందరితో చర్చలు సాగించి సామరస్యపూర్వక వాతావరణానికి తన వంతు కృషి చేసింది.మకూం లో తానున్న రెండేళ్ళ కాలం లో తిరుగు బాటు దారులు కూడా మెచ్చుకున్న ఏకైక పోలీసాఫీసర్ సంజుక్తానే.

వివాహం:
అక్కడ రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న తర్వాత చిరాంగ్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న “పురు గుప్తా” ని వివాహం చేసుకుంది.”డైనమిక్ ఆఫీసర్ గానే కాదు ఇల్లాలిగా కూడా తాను చక్కటి ఆడపిల్లనే అని నిరూపించుకుంది” అంటూ పురు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఇప్పుడు వారికో కుమారుడున్నడు. . ప్రస్తుతం సంజుక్తా పురు అస్సాంలోని జోర్హాట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తోంది.

ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు...
తన కలలు నెరవేర్చుకునేందుకు సంజుక్తా అసాధారణ రీతిలో చదువుపై దృష్టి సారించేంది. ఎప్పుడు చూసినా పుస్తకాలతోనే కాలక్షేపం చేసేదట. పోలీసు అధికారి అయినంత మాత్రాన కరుగ్గా ఉండనవసరం లేదని, మంచి మాటలతోను నేరాలు చేసే వారిలో పరవర్తన తేవచ్చని చెప్పే సంజుక్తా తో మాట్లడితే చాలు ఆ విషయం అర్థమైపోతుంది. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు క్రీడలపట్ల ఆసక్తి చూపుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది.

ఇది అంటే నాకు తొలి నుంచి ఇష్టం..:
యుపిఎస్‌సిలో మంచి ర్యాంక్ దక్కించుకున్న వాళ్లు ఐఎఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతారు. అయితే సంజుక్తా మాత్రం ఐపిఎస్ వైపు మొగ్గు చూపింది. ఎవరికైనా సహాయం చేయాలంటే పోలీసు శాఖలో అయితే సత్వరం వీలుంటుందని, అందుకే తనకు పోలీసు శాఖంటేనే తొలి నుంచి ఇష్టమని అంటూందీ ఆఫీసర్. పోలీసు శాఖలో పనిచేసేటప్పుడు పురుషులైనా, స్రీలైనా ఒక్కటేనని, ఎవరైనా సేవాభావంతో పనిచేస్తే ఫలితాలు ఒకేలా ఉంటాయని చెప్పే ఆమె వీలున్న ప్రతీసారీ ఆడపిల్లలలో ఆత్మ విశ్వాసం పెంపొందేలా ప్రసంగిస్తుంది కూడా.పని ఒత్తిడితో అలసట చెందితే తనకు తోడుగా తన తల్లి ఉంటుందని, తన భర్త సహకారం కూడా తోడవడంతో పూర్తిగా తన ఉద్యోగ బాధ్యతలపై దృష్టి నిలిపినట్లు చెబుతోంది.సంజుక్తా ఈ దేశపు ఆడ పిల్లల వీరత్వానికి ఒక ప్రతీక….

Published date : 21 Sep 2021 06:29PM

Photo Stories