IPS Neepa Manocha Success Story:సక్సెస్ అంతు చూసేదాక వదలిపెట్టేదే లే అని... పోరాటం చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారిలా.. సక్సెస్ జర్నీ మీకోసం..
సివిల్స్‌లో గెలిచి మంచి ర్యాంకు సంపాదించుకోవాలనేది చాలామంది యువత కోరిక. ఆ క్రమంలో మాములు తడబాటులు రావు. ఒకనోకదశలో మన వల్ల కాదని చేతులెత్తేసే పరిస్థితి వచ్చేస్తుంది. దాన్ని తట్టుకుని ముందుకు సాగిన వారే విజయతీరాలను అందుకోగలరు. అలాంటి గొప్ప సక్సెనే అందుకుంది నీపా మనోచ(Neepa Manocha). ఆమె విద్యా నేపథ్యం వచ్చేసి..2015లో ప్రసిద్ధ లేడీ శ్రీ రామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది. ఇక 2017లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) నిర్వహించే సెక్రటరీ (CS) ప్రొఫెషనల్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై స్టాక్ ఎక్స్ఛేంజ్ కంపెనీ సెక్రటరీ(CS)గా ఉద్యోగం సాధించింది.
అయినా సంతృప్తి చెందాక ఇంకా ఏదో సాధించాలన్న ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకమైన సివిల్స్ సర్వీస్‌కి ప్రిపేరయ్యింది. పగలు స్టాక్ ఎక్ఛ్సేంజ్ మార్కెట్‌లో కంపెనీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ.. రాత్రిళ్లు ప్రిపరేషన్ సాగించేది. అయితే సీఎస్‌లో వరించినట్లుగా సక్సెస్‌ని సులభంగా అందుకోలేకపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఫెయిలైంది. తన ఆత్మవిశ్వాసమే సన్నగిల్లిపోయేలా ఓటమిని ఎదుర్కొంది. లాభం లేదు ఈ ఎగ్జామ్ మన వల్ల కాదనే నైరాశ్యం తెప్పించేలా నిపాకి సివిల్స్ చుక్కలు చూపించింది.
ఇవి కూడా చదవండి: పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన కంప్యూటర్ కమాండర్....సిద్ధార్థ శ్రీవాత్సవ్.
ఇక్కడ నిపా ఆ తడబాటుల్ని తరిమేసి సక్సెని అందుకునేదాక వెనక్కి తగ్గకూడదనే పట్టుదల, కసితో చదివింది. చివరికి ఆమె కష్టం ముందు ఓటమే తలవంచి..దోబులాచుడతున్న సక్సెస్ ఒడిసిపట్టింది. నాలుగో ప్రయత్నంలో 144వ ర్యాంకు సాధించి ఐపీఎస్ సాధించింది. అంతేగాదు నిపా గనుక వరుస ఓటములతో ఆగిపోతే ఎవ్వరికీ ఆమె గురించి తెలిసి ఉండేది కాదు. ఓ ఫెయ్యిల్యూర్ స్టోరీగా మిగిలిపోయేది. ఓటమే తలొగ్గాలి తప్పా తాను కాదనుకుంది కాబట్టే సివిల్స్‌లో నిపా నెగ్గింది. అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. వదలిపెట్టకుండా పలకరిస్తున్న ఓటమి అంతు చూడాలే తప్ప తగ్గొద్దని చాటి చెప్పింది.
Tags
- IPS Neepa Manocha
- IPS inspiring succes stories
- IPS Neepa Manocha success story
- young women Neepa Manocha success story
- latest success stories in telugu
- young IPS Neepa Manocha success story in telugu
- Neepa Manocha IPS success story
- sakshi education
- Neepa Manocha success story in telugu
- sakshieducation success stories