Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేరయ్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..
ఈ మాట ఎంతోకొంత నిజం కూడా. కానీ, ప్రసూతి సెలవులో సివిల్స్‌కు సిద్ధమై.. ఐపీఎస్‌కు ఎంపికైన షెహనాజ్ ఇల్యాస్ కథ అలాంటిదే. ఈ నెపథ్యంలో షెహనాజ్ ఇల్యాస్ సక్సెస్ స్టోరీ మీకోసం..
☛ Success Story : ఇంట్లోనే ఉండి చదివా.. సివిల్స్ కొట్టానిలా.. కానీ.. నా లక్ష్యం మాత్రం ఇదే..
ఐటీ ఉద్యోగం.. జీతం బాగానే ఉన్నా..
చదువు ముగిసిన తర్వాత షెహనాజ్ ఓ ఐటీ కంపెనీలో చేరింది. ఐదేండ్లు ఆ రంగంలోనే పని చేసింది. జీతం బాగానే ఉన్నా, ఆ కొలువు పెద్దగా తృప్తినివ్వలేదు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలన్న తపన ఆమెది. అంతలోనే పెండ్లయింది.
➤ Success Story : ఎలాంటి ఒత్తిడి లేకుండా సివిల్స్ కొట్టానిలా.. నా రికార్డును నేనే..
తొమ్మిది నెలల గర్భంతో.. టీఎన్‌పీఎస్‌సీ పరీక్షల్లో..
గర్భిణిగా ఉన్న సమయంలో సివిల్ సర్వీసులలో చేరాలని బలంగా నిర్ణయించుకుంది. తొమ్మిది నెలల గర్భంతో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్‌సీ) ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించింది. అదీ తొలి ప్రయత్నంలో, కేవలం రెండు నెలల ప్రిపరేషన్‌తోనే. ఆ అనుభవంతో యూపీఎస్‌సీ సివిల్స్ కూడా రాయగలను, విజయం సాధించగలను అన్న విశ్వాసానికి పునాదిపడింది.
➤ Success Story : నలుగురు తోబుట్టువుల్లో.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఒక ఐపీఎస్.. వీరి సక్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే..
ఇలాంటి పరిస్థితి ఏ తల్లికైనా సవాలే.. కానీ
ఓ వైపు బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే రోజుకు 10 గంటలు చదవడం ఏ తల్లికైనా సవాలే. కుటుంబ సభ్యుల సహకారంతో ఆ అవరోధాన్ని అధిగమించింది. కఠోర శ్రమతో 2020 సివిల్ సర్వీస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 217వ ర్యాంకు సాధించింది. ఐపీఎస్ అధికారిగా ఎంపికైంది. సివిల్స్ కోసం నేను నెల మొత్తానికీ ప్రణాళిక వేసుకునేదాన్ని. దీనిని క్రమం తప్పకుండా ఆచరణలో పెట్టి విజయం సాధించాను అంటున్నారు తమిళనాడుకు చెందిన షెహనాజ్. ఈమె విజయం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకమైంది.