Success Story : ఎలాంటి ఒత్తిడి లేకుండా సివిల్స్ కొట్టానిలా.. నా రికార్డును నేనే..
ఇంటర్వ్యూలో 275 మార్కులకు గానూ అపల 215 మార్కులు సాధించింది. గత సంవత్సరం ఇంటర్వ్యూలో అత్యధికంగా 212 మార్కులు వచ్చాయి.
మూడో ప్రయత్నంలో..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన డాక్టర్ అపల మూడో ప్రయత్నంలో 9వ ర్యాంకు సాధించింది. ఆమె ఇంటర్వ్యూ 40 నిమిషాల పాటు సాగింది. అన్ని ప్రశ్నలకు అపల సమాధానం ఇచ్చారు. ఇంటర్వ్యూ ప్రారంభంలో కొద్దిగా ఆందోళనకు గురైనప్పటికీ.. తర్వాత తనలో ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్నానని అపల చెప్పుకొచ్చారు. అలా అన్ని ప్రశ్నలకు తడబడకుండా సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ రౌండ్ అనేది చాలా ప్రధానమైనది అని తెలిపారు. తమ ప్రెజెంటేషన్‌తో పాటు పర్సనాలిటీ స్కిల్స్‌ను బోర్డు మెంబర్లు పరిశీలిస్తారని తెలిపారు.
ప్రతి రోజు 30 నుంచి 40 నిమిషాల పాటు..
అపల సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఆమె ఒక ప్రణాళికబద్ధంగా చదివేది. ఏడాది క్రితం తన గదిలో ఒక పోస్టర్‌ను అపల ఏర్పాటు చేసుకుంది. ఆ పోస్టర్‌లో ఐ విల్ బీ అండర్ 50 అని రాసి ఉంటుంది. ఆ పోస్టర్‌ను డే అండ్ నైట్ చూస్తూ.. తాను సాధించే లక్ష్యంపై గురి పెట్టేది. చదువు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు తండ్రితో కలిసి ప్రతి రోజు 30 నుంచి 40 నిమిషాల పాటు టేబుల్ టెన్నిస్ ఆడేవారు. అపల తండ్రి ఆర్మీ కల్నల్, తల్లి ఢిల్లీ యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్.
☛ IAS Officer Success Story : నాన్న డ్రైవర్.. కూతురు ఐఏఎస్.. చదవడానికి డబ్బులు లేక..