Civils Success Story: ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో ఫెయిల్... సెకండ్ అటెంప్ట్‌లో రెండో ర్యాంకు సాధించానిలా...
ఈ ఏడాది విడుదలైన సివిల్స్ ఫలితాల్లో టాప్ 10లో అమ్మాయిలే సత్తా చాటారు. ఆల్ ఇండియా రెండో ర్యాంకు కూడా అమ్మాయే సాధించింది. ఆ అమ్మాయే 24 ఏళ్ల గరిమ లోహియా.
గరిమా లోహియాది బిహార్‌లోని బక్సర్ (Buxar) ప్రాంతం. ఆమె తండ్రి మనోజ్‌కుమార్ లోహియా. తల్లి సునీత. ఈ దంపతులకు నలుగురు సంతానం. కాగా, అందులో రెండో అమ్మాయే గరిమ. మనోజ్, సునీత దంపతులకు 1999లో గరిమ జన్మించింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా గరిమ చిన్న నాటి నుంచే ఆటల్లో, పాటల్లో, చదువులో ఎప్పుడూ ముందుండేది.
తన ప్రాథమిక విద్యాభ్యాసం బక్సర్ లోని వుడ్ స్టాక్(Woodstock School) స్కూల్ లో పూర్తి చేసింది. ఇంటర్ చదివేందుకు యూపీ వెళ్లింది. వారణాసిలోని సన్ బీమ్(Sunbeam School) స్కూల్ లో హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేసింది. పదిలో 10కి 10 జీపీఏ సాధించింది.
ఇలా సాఫీగా సాగిపోతున్న గరిమ జీవితంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హోల్‌సేల్ వస్త్ర దుకాణం నిర్వహించే ఆమె తండ్రి మనోజ్ 2015లో హార్ట్ ఎటాక్‌తో మరణించారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కుటుంబానికి పెద్దగా ఉన్న తండ్రి మరణంతో పూర్తిగా డల్ అయ్యింది.
చదవండి: 16 ఏళ్లకే వినికిడి శక్తి కోల్పోయా... కేవలం నాలుగు నెలల్లోనే ఐఏఎస్ సాధించానిలా...
గరిమాది ఉమ్మడి కుటుంబం. దాదాపు 13 మంది ఉండేవారు. దీంతో కుటుంబ భారాన్ని తన తండ్రి నాన్న మోశారు. దీంతో ఆమె మళ్లీ చదువుపై ద`ష్టి పెట్టింది. అలా ఇంటర్‌లో 98.2 శాతం మార్కులతో స్టేట్ టాపర్లలో ఒకరిగా నిలిచింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కిరోరీ మాల్ కాలేజ్(Kirori Mal College)లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
కాలేజీ చదువు పూర్తయ్యే సమయానికి కోవిడ్ మహమ్మారి దాపురించింది. ఆ సమయంలో ప్రజల బాధలను దగ్గరుండి గమనించింది. అప్పుడే నిర్ణయించుకుంది తాను సమాజానికి సేవ చేయాలని. దీంతో తన లక్ష్యం సివిల్స్ అనుకుంది.
కాలేజీ పూర్తయిన వెంటనే సివిల్స్‌కు సన్నద్ధమవడం ప్రారంభించింది గరిమ. స్కూల్, కాలేజీ స్థాయిలో తానే టాపర్‌గా ఉండడంతో ఈజీగానే సివిల్స్‌లో సత్తా చాటేస్తాననుకుంది. కానీ, ప్రిలిమ్స్ రాస్తే గాని తెలియలేదు ఆమెకు. పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో.
2021లో మొదటిసారి సివిల్స్ పరీక్ష రాసింది. ఆ పరీక్షలో ఆమె ప్రిలిమినరీ పరీక్షను కూడా పాస్ కాలేకపోయింది. దీంతో ఒక్కసారిగా ఆమెకు వాస్తవ పరిస్థితి అర్థం అయ్యింది. సివిల్స్ పాస్ అవ్వాలంటే సాదాసీదా వ్యవహారం కాదని అర్థం చేసుకుంది. దీంతో రోజుకు దాదాపు 15 గంటల పాటు చదవడం ప్రారంభించింది. ఒక్కోసారి చదువుతూ చదువుతూ అలానే నిద్రపోయేది.
చదవండి: IFS Telugu Topper కొల్లూరు వెంకట శ్రీకాంత్ Success Story
2022లో రెండో ప్రయత్నానికి సిద్ధమైంది. మొదటి సారి ప్రిలిమ్స్‌లోనే గట్టెక్కలేకపోవడంతో... తప్పులను పునరావ`తం చేయకూడదని నిర్ణయించుకుంది. అలా ప్రిలిమ్స్ పరీక్షకు అటెండ్ అయ్యింది. ప్రిలిమ్స్ గట్టెక్కింది. అలాగే మెయిన్స్ క్లియర్ చేసింది. ఇక పర్సనల్ టెస్ట్ పూర్తి చేస్తే తన కల నెరవేరుతుంది.
ఇంటర్వ్యూలో మంచి ఫర్మామెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం మాక్ ఇంటర్వ్యూలకు అటెండ్ అవడం ప్రారంభించింది. చివరికి ఇంటర్వ్యూ పూర్తి చేసి, ర్యాంకు గ్యారంటీగా వస్తుందని నమ్మింది. మే 23న ప్రకటించిన ఫలితాలను చూసి ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. ఆల్ ఇండియా లెవల్‌లో రెండో ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకుంది గరిమ. ఇందులో ఆమెకు వచ్చిన మార్కులు 1063.
గరిమ లోహియా గురించి మరికొన్ని విశేషాలు....
సివిల్స్‌లో గరిమా ఆప్షనల్ సబ్జెక్ట్‌గా కామర్స్ అండ్ అకౌంటెన్సీని ఎంచుకుంది.
పరీక్ష ఒత్తిడిని జయించడానికి పాఠశాల విద్యార్థులకు ఆమె పాఠాలు బోధించేంది.
అలాగే అప్పుడప్పుడు రిలీఫ్ కోసం పాటలు వింటూ ఉండేది.
గరిమ మార్వాడి, హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతుంది.
కాలేజీలో చదువుకునే రోజుల్లో మహిళా సాధికారతపై ఆమె రాసిన వ్యాసం యునైటెడ్ నేషన్స్ నుంచి బహుమతి అందుకుంది.
గరిమ అక్కకు పెళ్లైంది. ఒక తమ్ముడు బీకాంలో డిగ్రీ చదువుతున్నాడు. ఇంకో చెల్లి కూడా చదువుకుంటూ ఉంది.