Skip to main content

Success Story : మాది నిరుపేద కుటుంబం.. మా ఇంట్లో ఆకలి బాధ‌లు చూసే.. సివిల్స్​‍ వైపు నడిచానిలా..

మాది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద రైతు కుటుంబం. మాకు ఎకరం పొలం ఉన్నా రేయింబవళ్లు కూలి చేస్తేనే కుటుంబం గడుస్తుంది.
UPSC Ranker Naresh
ఆకునూరి నరేష్‌

నా తల్లిదండ్రులకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు. మా పోషణ భారంగా ఉన్నా.. మమ్మల్ని ప్రయోజకులను చేయాలనుకున్నారు మా తల్లిదండ్రులు. 

నేను మా అమ్మ‌నాన్న‌ తపన, ఆకలి మంటలు చూసి గొప్పస్థాయిలో నిలువాలనుకున్నాను. తల్లిదండ్రుల ఆశయం కోసం పట్టుదలతో చదివి సివిల్స్​‍లో 117వ ర్యాంకు సాధించాను. 

కుటుంబ నేప‌థ్యం :

UPSC Ranker Naresh Family

మాది జయశంకర్‌ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశింపల్లి గ్రామం. నా తల్లిదండ్రులు ఆకునూరి అయిలయ్య, సులోచన.

Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే..

నా చ‌దువు సాగిందిలా..
స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు, 6 నుంచి 10 వరకు నర్సంపేటలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌లో, ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో పూర్తిచేసి, బీటెక్‌  ఐఐటీ మద్రాస్‌లో పూర్తిచేశాను.

S Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం..
2017లో చెన్నైలోని బ్యాంకులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాను. నా లక్ష్యం సివిల్స్​‍ సాధించడానికి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్​‍ ప్రిపరేషన్‌ కోసం వీకెండ్‌ ఆన్‌లైన్‌ అకాడమీలో చేరాను.

UPSC Civils Ranker -2021: పిచ్చోడన్నారు.. తూటాలు దింపారు.. ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీకి షాక్ అవ్వాల్సిందే..

ఉద్యోగానికి రాజీనామా చేసి..
2018లో ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కు వచ్చి సివిల్స్​‍ ప్రిపరేషన్‌పై దృష్టి సారించాను. ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా 10 నుంచి 12 గంటలు చదివాను. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, దిన పత్రికలను క్షుణ్ణంగా చదివాను. గత ప్రశ్నపత్రాలను పరీశీలిస్తూ ప్రాక్టీస్ చేశాను. 2017, 2018లో సివిల్స్​‍ రాసినా ర్యాంకు రాలేదు. 2019లో 782వ ర్యాంకు వచ్చింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ సివిల్స్​‍కు ప్రిపేర్‌ అయి 117వ ర్యాంకు సాధించాను.

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి

Published date : 08 Oct 2022 05:21PM

Photo Stories