Skip to main content

Success Story: జీవితంలో మొదటిసారి ఫెయిల‌య్యా.. కానీ మ‌ళ్లీ స‌క్సెస్ కోసం మాత్రం..

ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అంతిమ లక్ష్యం వైపు పోవడం దీర్ఘకాలిక ప్రక్రియ. సరిగ్గా అటువంటి మార్గంలో పయనిస్తూ.. యూనియ‌న్ ప‌బ్ల‌క్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా చదువుతూ మధ్యలో జాతీయస్థాయిలో నిర్వహించే సీఏపీఎఫ్‌(CAPF)లో ఆల్‌ ఇండియా 15వ ర్యాంక్‌ సాధించాడు సయింపు కిరణ్‌. ఈ నేప‌థ్యంలో కిరణ్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..
Kiran Saiempu
Kiran Saiempu Success Story

నా కుటుంబ నేపథ్యం :

Kiran Saiempu success story in telugu

మాది వరంగల్‌ జిల్లా గీసుకొండ దగ్గరలోని అనంతారం గ్రామం. మా కుటుంబం వ్యవసాయ చేస్తూ జీవ‌నం సాగించేవాళ్లం. నాన్న ప్రభాకర్‌ రావు, అమ్మ జయలక్ష్మి వ్యవసాయం.

Success Story : వరుసగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టానిలా.. ఇలా చదవడం వ‌ల్లే..

నా ఎడ్యుకేష‌న్ :
నేను వరంగల్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేశాను. తర్వాత ఇంటర్‌ ప్రైవేట్‌ కాలేజీలో చదివాను. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 1598 ర్యాంక్‌ సాధించి ఐఐటీ ఢిల్లీలో చేరాను. అక్కడ బీటెక్‌ పూర్తిచేసిన తర్వాత ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్‌ ప్రారంభించాను. మా కుటుంబంలో నేనే మొదటి గ్రాడ్యుయేట్‌ను. అమ్మానాన్నలు కష్టపడి నన్ను చదివించారు. వీరి ప్రోత్సాహంతోనే ఐఐటీ ఢిల్లీ వరకు వెళ్లగలిగాను.

IAS Officer Success Story : నాన్న డ్రైవ‌ర్‌.. కూతురు ఐఏఎస్‌.. చ‌ద‌వ‌డానికి డ‌బ్బులు లేక‌..

ఫైనల్‌ ఇయర్‌లో ప్లేస్‌మెంట్స్‌కు వెళ్లకుండా సివిల్స్‌కు..
ఐఏఎస్‌ లక్ష్యంగా ఐఐటీ బాంబే, మద్రాస్‌లో సీటు వచ్చినా ఐఐటీ ఢిల్లీనే ఎంపిక చేసుకున్నా. దీనికి కారణం సివిల్స్‌కు ఢిల్లీలో మంచి ప్లాట్‌ఫాం ఉండటం. సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తయ్యే వరకు దానిలోనే లీనమయ్యా. మంచి కాలేజీలో చేరడం వల్ల మంచి స్నేహితులు, మంచి ఎక్స్‌పోజర్‌ లభిస్తాయి. ఫైనల్‌ ఇయర్‌లో ప్లేస్‌మెంట్స్‌కు వెళ్లకుండా సివిల్స్‌ ఆప్షనల్స్‌కు కోచింగ్‌ తీసుకున్నాను.

Inspiring Success : చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి, పిల్లలు.. ఈ ప‌ట్టుద‌ల‌తోనే డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా.. కానీ

జీవితంలో మొదటిసారి ఫెయిల్యూర్‌.. కానీ..

Kiran Saiempu Success story

2017లో బీటెక్‌ పూర్తయ్యాక 2018లో యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ను మొదటిసారి రాశాను. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాలేదు. జీవితంలో మొదటిసారి ఫెయిల్యూర్‌ను చూశాను. ఈ అపజయంతో ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. దీంతో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను. తప్పులను సరిదిద్దుకొని ముందుకు ప్రయాణించాను. 2019, 2020లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్‌ పూర్తి చేసి మెయిన్స్‌ రాశాను. రెండు మార్కులతో సెకండ్‌ అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ మిస్‌ అయింది. 2021లో మాత్రం ఇంటర్వ్యూకు అవకాశం వచ్చింది.

Inspiring Success Story : ముగ్గురు కూతుళ్లు.. ఒకేసారి పోలీసు ఉద్యోగం రావడంతో..

ఈ చివరి రోజునే..
సివిల్స్‌ ప్రస్థానం సుదీర్ఘమైనది. దీనిలో ఉండగా సీనియర్‌ మిత్రుడు వాట్సప్‌ డీపీ చూస్తుండగా పోలీస్‌ ఆఫీసర్‌ డ్రెస్‌లో కనిపించాడు. వెంటనే ఏం చేస్తున్నావని ఫోన్‌ చేసి వివరాలు అడిగాను. అతను సీఏపీఎఫ్‌ రాసి అసిస్టెంట్‌ కమాండెంట్‌ జాబ్‌ సాధించాను అని చెప్పాడు. ఈ ఎగ్జామ్‌ సివిల్స్‌కు ఉపయోగపడుతుందని చెప్పాడు. దీంతో దానికి దరఖాస్తు చేశాను. దరఖాస్తుకు చివరి రోజు కావడం, వయోపరిమితికి సరిగ్గా 20 రోజుల తక్కువ వయస్సు ఉండటం కలిసి వచ్చింది. సివిల్స్‌కు ప్రిపేర్‌ అయి ఉండటంతో ఈ ఎగ్జామ్‌ సులభంగా పూర్తిచేశాను. ఈ ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు ఉంటాయి. ఈ రెండింటిని ఒకే రోజు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్‌ పేపర్‌ కరెక్షన్‌ చేస్తారు. తుది ఎంపికలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా చేస్తారు. సీఏపీఎఫ్‌లో సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ దళాలు ఉంటాయి. వీటిలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల కోసం సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది.

Inspiring Success Story : ఒకే జిల్లా. ఒకే బ్యాచ్‌.. ఎస్సై జాబులు కొట్టారిలా.. సొంత ఊరు కోసం..

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కంటే చాలా సులభంగా..

Kiran Saiempu and Mahesh Bhagwat

సీఏపీఎఫ్‌ పోస్టులు మంచి హోదా, జీతం కలిగినవి. మన రాష్ట్రం నుంచి తక్కువ మంది దీనివైపు వెళ్తున్నారు. మహారాష్ట్ర నుంచి 50 శాతం మంది అభ్యర్థులు ఈ పోస్టుల్లో విజయం సాధిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో.. ఎస్‌ఐ, ఆర్మీ, సివిల్స్‌కు ప్రిపేరయ్యే వారు ఈ పోస్టులను సులభంగా సాధించవచ్చు.
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కంటే చాలా సులభంగా ఉంటుంది ఈ పరీక్ష. ఈ పరీక్షలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలోని కొన్ని పార్ట్స్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. వీటి కోసం పదోతరగతి స్థాయి బుక్స్‌ చదివితే సరిపోతుంది. మెయిన్స్‌లో ఇంగ్లిష్‌ బేసిక్స్‌, గ్రామర్‌ను పరీక్షిస్తారు. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మెయిన్స్‌ డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. దీనిలో ప్రశ్నకు మనం ఎలాంటి సమాధానం రాశామో పరిశీలిస్తారు. మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు సాధించిన రెండో అభ్యర్థిగా నిలిచాను. ఇంటర్వ్యూ సివిల్స్‌ ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది. దీనివల్ల భవిష్యత్‌లో సివిల్స్‌ రాయాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అనుభవాన్ని ఇస్తుంది.

Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

ఈ పోస్టు వ‌ల్ల‌..
అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దేశసేవతో పాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయి. చక్కటి పదోన్నతులు లభిస్తాయి.

నా విజయంలో..
నా తల్లిదండ్రులు, మిత్రుడు మనీష్‌, చెల్లెలు గిరిజ ప్రోత్సాహంతో ఈ విజయం సాధించాను. సివిల్స్‌లో రెండుసార్లు అపజయం పొందాక హైదరాబాద్‌ వచ్చాను. బాలలత మేడం దగ్గర పర్సనల్‌ గైడెన్స్‌ తీసుకున్నాను. ముఖ్యంగా సీఏపీఎఫ్‌ ఇంటర్వ్యూకు మేడం ఇచ్చిన సలహాలు వందశాతం ఉపయోగపడ్డాయి.

Sirisha, SI : న‌న్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..

ఫెయిల్యూర్ నుంచి.. స‌క్సెస్ వైపు..
ఫెయిల్యూర్‌ను శాపంగా భావించవద్దు. చుక్కలను గురిచూసి కొట్టినప్పుడు అది మిస్‌ అయినా మీరు కనీసం చంద్రుడినైనా కొడుతారు అనే నానుడి ప్రకారం గొప్పదైన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దాన్ని సాధించడానికి నిరంతరం శ్రమించాలి.మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఫలితం కోసం ఆశించవద్దు. చదివిన చదువు జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది.పగటి కలలు కనవద్దు. వాటి వల్ల సమయం వృథా తప్ప ఏ ఫలితం రాదు. ఎంత బాగా వర్క్‌ చేస్తే అంత మంచి హోదా వస్తుంది.

Supraja,DSP : వీరిని లెక్కపెట్టకుండా చదివా..గ్రూప్-1 ఉద్యోగం కొట్టా..

Published date : 30 Nov 2022 07:05PM

Photo Stories