IAS Success Story: 16 ఏళ్లకే వినికిడి శక్తి కోల్పోయా... కేవలం నాలుగు నెలల్లోనే ఐఏఎస్ సాధించానిలా...
16 ఏళ్ల వయసులో తన వినికిడి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయింది సౌమ్య. అంతవరకు అందరిలా ఆడుతూపాడుతూ గడిపిన ఆమె జీవితం ఒక్కసారిగా దిగ్భ్రాంతికిలోనైంది. ఇక జీవితాంతం చెవుడు అంటే.. వింటేనే మనకు భయంకరంగా ఉంటుంది. కానీ, ఆమె మాత్రం పాజిటివ్‌గానే స్పందించింది.
శాస్త్ర, సాంకేతికంగా అభివ`ద్ధి చెందిన ప్రస్తుతకాలంలో ఇదేమీ పెద్ద సమస్యకాదని, వినికిడి పరికరాలను ఉపయోగించుకుని మునుపటిలా చలాకీగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తన తొలిప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఆల్ ఇండియా 9వ ర్యాంకు సాధించింది.
విద్యాభ్యాసం ఇలా...
అశోక్ శర్మ, లీనా శర్మ దంపతులకు 1994లో సౌమ్య జన్మించింది. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో ఆమె కూడా న్యూరాలజిస్ట్ కావాలనుకుంది. కానీ, తన 16 ఏళ్ల వయసులో వినికిడి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయాక తన లక్ష్యాన్ని మార్చుకుంది. 2010లో పదో తరగతిని 10/10 జీపీఏతో పూర్తి చేసింది.
లాయర్ కావాలనుకుని...
ఇంటర్మీడియట్ 94 శాతం మార్కులతో పూర్తి చేసిన తర్వాత లా చదవాలని నిర్ణయించుకున్న సౌమ్య... 2012లో లా ఎంట్రన్స్ పరీక్ష CLAT and AILETని రాసింది. 2017లో తన లా పూర్తి చేసింది. అదే ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు రాసే సమయంలో యూపీఎస్సీ రాయాలని నిర్ణయించుకుంది. లా పూర్తయిన వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించింది.
Success Story: వరుసగా నాలుగు సార్లు ఫెయిల్...ఏడేళ్ల నిరీక్షణ.. చివరికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...
ఎలాంటి కోచింగ్ లేకుండా...
లా పరీక్షలు ముగిసిన తర్వాత.. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రతీరోజు 16 నుంచి 17 గంటలు చదువుతూనే ఉండేది. న్యూస్‌పేపర్స్‌ను జల్లెడ పట్టేది. సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించింది. తన తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ పాసైంది.
☛ IAS Varun Baranwal: 15 ఏళ్లకే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్లకే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ సక్సెస్ స్టోరీ
ప్రిలిమ్స్ పూర్తి చేసిన తర్వాత మరింత సమయం చదవడానికే కేటాయించింది. ఆమెకు తెలిసిందల్లా కేవలం చదవడం మాత్రమే. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను నెమరువేసింది. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా లానే ఎంచుకుంది. అలా చదువుతూ మెయిన్స్‌కూడా గట్టెక్కింది.
ఇంటర్వ్యూలో ఇలా...
సౌమ్య శర్మ మొదటినుంచి వైకల్యం ఉన్న వ్యక్తి కాదు. కానీ, 16 ఏళ్ల వయసులో అనుకోకుండా తన వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయింది. దీంతో ఆమె రిజర్వేషన్‌కు అర్హురాలు. కానీ, ఆమె జనరల్ కోటాలోనే ఇంటర్వ్యూకి హాజరైంది. యూపీఎస్సీ-2017 పరీక్ష ఫలితాలు 2018లో విడుదలయ్యాయి. ఫలితాల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె దూసుకెళ్లింది. 1108 మార్కులతో ఆల్ ఇండియా 9వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకుంది.
NEET 2023 Rankers: నీట్‌లో అదరగొట్టిన గొర్రెల కాపర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డబ్బులు లేకపోవడంతో...
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి...
మెయిన్స్ రాసే సమయంలో విపరీతమైన జ్వరం. కానే, నేను నా ధైర్యాన్ని కోల్పోలేదు. సివిల్స్ రాయడానికి నాకు కేవలం 4 నెలలు మాత్రమే సమయం ఉన్నింది. పూర్తి ఆత్మవిశ్వాసంతోనే నేను విజయం సాధించగలిగా. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న వారు ఎప్పటికీ తమ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు - సౌమ్యశర్మ
NEET 2023 Ranker Inspirational Story : 11 ఏళ్లకే పెళ్లి... 20 ఏళ్లకు పాప... ఐదో ప్రయత్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ
ప్రస్తుత పోస్టింగ్....
ప్రస్తుతం నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈఓగా మహారాష్ట్ర కేడర్‌లో సౌమ్య విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రంలో 2.49 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. నాగ్ పూర్ సిటీ డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అర్చిత్ చందక్‌ను సౌమ్య వివాహం చేసుకున్నారు.