Skip to main content

IAS Success Story: మారుమూల పల్లెటూరి యువ‌కుడు.. ఐఏఎస్ కొట్టాడిలా..

యోగేష్ పాటిల్.. ఈయ‌న సివిల్స్ యాత్ర ఎక్కడో మారుమూల పల్లెటూరిలో మొదలయింది. చివరకు ఈయ‌న ఐఎఎస్ క‌ల‌ 2020లో నెరవేరింది.
యోగేష్ పాటిల్, ఐఎఎస్
యోగేష్ పాటిల్, ఐఎఎస్

పాటిల్ యాత్ర‌ చాలా ఆస‌క్తిగా ఉంటుంది. ఈయ‌న చెప్పేమాటలు కచ్చితంగా పరీక్షలు రాసే అభ్య‌ర్థుల‌కు ఏపాటి నిరుత్సాహం ఉన్నా పొగొడతాయి. ఈయ‌న తండ్రి ఒక స్కూల్ టీచర్. అందువల్ల పాఠశాల విద్యాభ్యాసం గ్రాామాల్లోనే సాగింది.

Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

ఈ ఒక్కమాట చాలు..
పాటిల్  సివిల్స్ ఆలోచనకు పదేళ్ల చరిత్ర ఉంది. దానికి బీజం 2010లో పడింది. 2020 నాటి మొక్కై.. మానై.. ఫలాన్నిచ్చింది. ఈ ఒక్కమాట చాలు, చాలామందిని ఉత్తేజపరచడానికి. ఐఎఎస్ ఆలోచన  వచ్చే నాటికి ఆయన పదో తరగతిలో ఉన్నాడు. స్కూలింగ్ మొత్తం మరాఠీ మీడియంలోనే సాాగింది. ఇంటర్  ఆయన  వాళ్ల ఊరి పక్కనే  ఉన్న జూనియర్ కాలేజీలోనే చదివారు. తర్వాత పుణేలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. అక్కడే ఆయనకు సివిల్స్ గురించి స్పష్టమైన‌ ధ్యేయం ఏర్పడింది.  ఆ తర్వాత ఆయన సివిల్స్ ప్రిపేరేషన్‌కు ఢిల్లీ వెళ్లారు. మొదటి దఫాలోనే  విజయం సాధించి 231 ర్యాంక్‌ సాధించి.. ఐపిఎస్‌కు ఎంపికయ్యారు. అయితే ఆయన ధ్యేయం ఐఎఎస్ కాబట్టి, రెండో సారి సివిల్స్ రాశారు. ఈ సారి ఆయనకు ఆల్ ఇండియా 63వ ర్యాంకు సాధించారు.  ఆయన కల నెరవేరింది. అంతేకాదు, కలని ఎలా సాకారం చేసుకోవాలో ఆయన సివిల్స్ యాత్ర ఒక పాఠంగా మారింది.

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..

ఒక సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా..
ఒక్కొక్క సివిల్స్ సక్సెస్ స్టోరీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరి మార్గం వారు ఎంచుకోవాలనేందుకు పాటిల్ అనుభవం ఒక నిదర్శనం. ఎందుకంటే, ఆయన మెకానికల్  ఇంజనీరింగ్  చదివినా,  అప్షనల్‌గా ఎంచుకున్నది ఆంత్రోపాలజీని. అంతేకాదు, ఒక సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకున్నాక కథ ముగియదు. ఆప్షనల్‌ని  ఎలా చదవాలి..? ఏం చదవాలి..? అనేది ఎంత ముఖ్యమో పాటిల్ చక్కగా వివరించారు.

Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే.. ఐపీఎస్‌ అయ్యానిలా..

ఆంత్రోపాలజీ వంటి తనకు పరిచయం లేని కొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకోవడమే కాదు, ఆ సబ్జెక్ట్‌ను ఆయన ఎంత చక్కగా ప్రిపేరయ్యారంటే.. చివరకు  జాతీయ స్థాయిలో ఎక్కువ మార్కులు సంపాదించిన వారిలో నాలుగో వ్యక్తిగా నిలిచారు. చిత్రం ఏంటేంటే.. ఆంత్రోపాలజీ ఆప్షనల్ ప్రిపేరేషన్‌కు పాటిల్ చదివినది చాలా తాజా పుస్తకం. ఆ పుస్తకం పేరు Persistence and Change in Tribal India. దీనిని రాసింది డాక్టర్ రావ్‌. ఆంత్రోపాలజీ ఆప్షనల్ తీసుకుని సివిల్స్ ప్రిపేరవుతున్న వారికి ఇదొక విలువైన‌ సలహా .

Anudeep Durishetty, IAS: నేను సివిల్స్‌లో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించ‌డానికి కార‌ణం ఇదే..

ఇందుకే చాలా ఎక్కువ మార్కులు..

IAS Interview


సివిల్స్ రాసే వాళ్లకి పాటిల్ మరొక అద్భుతమయి సలహా ఇచ్చారు. అది ప్రశ్నలకు జవాబు రాసే తీరు. కృతకంగా సమాధానాలు రాయకూడదు. ఉదాహరణకు దేశంలో గిరిజన సమస్యలకు పరిష్కారం సూచిస్తున్నపుడు ఎవో తోచింది రాయడం కాకుండా. లోతైన సమాధానాలు, ఆలోచింప చేసే సమాధానాలు రాయడం మీ  విజయ రహస్యం అని చెబుతున్నారు.  డాక్టర్ రావు రాసిన Persistence and Change in Tribal India పుస్తకం చదివినందునే తాను పరీక్ష చక్కగా రాశానని, అందుకే చాలా ఎక్కువ మార్కులు సంపాదించానని ఆయన చెప్పారు. ఎందుకంటే, ఆ పుస్తకం గిరిజన  జీవితం, వాళ్ల సమస్యలు, వాటిని పరిష్కరించే మార్గాలు, అపుడు ఎందురవుతున్న సవాళ్లను బాగా రికార్డు చేసింది. ఇది  ఈ స‌బ్జెక్ట్‌ల‌లో లెేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే ప్రిపేర్ అయ్యేందుకు మంచి పుస్తకం, తాజాగా వచ్చిన పుస్తకం, శాస్త్రీయ పరిశోధనతో రాసిన పుస్తకం చదవడం చాలా అవసరమని పాటిల్ చెప్పారు. తన  విజయ రహస్యాన్ని ఆయన ఒక వాక్యం లో ఇలా చెప్పారు.

Surya Sai Praveen Chand,IAS : అమ్మ చెప్పిన ఈ మాట కోసమే ఐఏఎస్ సాధించా..

“Commitment and Consistency are twin pillars of success. To start your journey you need a ‘yes, I want to do this’ commitment. And to face the journey you need consistency over a period of time to finish the goal you have decided for yourself.”

సక్సెస్ అంత సులభం కాదు. ఈ యాత్రలో చాలా ఆటంకాలుంటాయి. వాటిని అధిగమించాలంటే సతమతమవకతప్పదని ఆయన చెబుతున్నారు.

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిలో..

IAS Success Story


గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిలో ఆత్మన్యూనత (Inferiority complex)ఉంటుంది. ఎలాంటి సామాజిక నేపథ్యం నుంచి వచ్చినా,  జీవితం పట్ల మీకు ఎలాంటి వైఖరి ఉందనేదే అసలు విషయం. మానసిన స్థయిర్యం అలవర్చుకోవాలి. ఎందుకంటే, ప్రతిరోజు పొద్దున లేస్తూనే అదే చదవుతూ ఉండాలి. ఇలాంటి జీవిత వాస్తవాన్ని ఫేస్ చేసేందుకు చాలా మెంటల్ టఫ్ నెస్ ఉండాలని పాటిల్ చెబుతున్నారు.  ఇది చాలా  మంచి, విలువైన‌ అబ్జర్వేషన్ అనిపిస్తుంది. పాటిల్ ప్రిపేరేషన్‌లో మరొక ఆసక్తికరమయిన కోణం ఉంది. అది విపస్సాన (Vipassana) కోచింగ్ .  ఇది తనకు  ఇది బాగా ఉపయోగపడిందని ఆయన చెబుతన్నారు.  ” ప్రిపరేషన్ కు కేవలం హార్డ్ వర్క్ మాత్రమే సరిపోదు. దానికి దృఢ చిత్తం, మానసిక ప్రశాంతత అవవసరం. ఈ కోచింగ్ నాకు ఈ రెండింటిని అందించింది,” అని ఆయన చెప్పారు.

Anu Kumari, IAS : కొడుకును చూసుకుంటూనే..రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంక్‌

​​​​​​​IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Published date : 13 May 2022 07:55PM

Photo Stories