Anu Kumari, IAS : కొడుకును చూసుకుంటూనే..రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంక్
నాలుగేళ్ల కుమారుడిని చూసుకుంటూనే రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదువుతూ రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంకు సాధించారు. ఆమె భర్త వ్యాపారవేత్త.
గ్రామంలో పేపర్ కూడా వచ్చేది కాదు..ఆన్‌లైన్ సహాయంతోనే
ఆమె దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేశారు. నాగ్‌పుర్‌లోని ఐఎంటీ నుంచి ఎంబీఏ చేశారు. 2016లో తొలిసారి ప్రయత్నించారు. కేవలం రెండు నెలలు మాత్రమే చదివి పరీక్ష రాశారు. అయితే ప్రిలిమ్స్‌లో ఒక్క మార్కుతో అర్హత కోల్పోయారు. దీంతో మళ్లీ ప్రయత్నించి ఏకంగా రెండో ర్యాంకు దక్కించుకున్నారు. తాను సివిల్స్‌కు సన్నద్ధమైన గ్రామంలో పేపర్ కూడా ఉండదని, ఆన్‌లైన్ సహాయంతోనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యానని పేర్కొన్నారు.
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
నా ప్రధాన లక్ష్యం ఇదే..
జీవితంలో ఏదైనా సాధించాలంటే దృఢసంకల్పం అవసరం అని, అలా ఉంటే విజయం సాధించకుండా ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల భద్రతే తన ప్రధాన లక్ష్యమన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ అను కుమారికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అను కుమారి నుంచి హరియాణా అమ్మాయిలు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
రెండవ చాయిస్ లేకుండా చదివా..మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ కొట్టా..: స్నేహలత, కలెక్టర్
Civils Results : సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు...ఐఏఎస్ అయ్యాడిలా..
Brothers Success : అన్న ఐఏఎస్..తమ్ముడు ఐపీఎస్..మా సక్సెస్‌కు వీరే కారణం