Skip to main content

Ramesh IPS Success Story : జీవితంలో కష్టాలు రావడం కూడా అదృష్టమే.. ఈ ఐపీఎస్ స్టోరీ చ‌దివితే..మీకే తెలుస్తుంది..

ఏ లక్ష్యమైన గాని దానిని కేవలం మనసులో అనుకున్న దాని కన్నా ఒక పేపర్ మీద రాసి ఉంచితే ఆ లక్ష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆవుల రమేష్ రెడ్డి ఐపీఎస్‌.
IPS Ramesh Reddy
IPS Ramesh Reddy Success Story

అంతే కాకుండా తాను ఐపీఎస్ ఆఫీస‌ర్ కావాల‌ని ఎన్నో సార్లు పేప‌ర్ మీద‌ రాసుకునేవారు ఈయ‌న‌. తాను రాసుకున్న‌ట్టుగానే నిజంగా ఐపీఎస్ సాధించారు. ఈ నేప‌థ్యంలో ఐపీఎస్ ర‌మేష్ రెడ్డి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

IPS Success Story : న‌న్ను విమర్శించిన‌ వారే.. ఇప్పుడు త‌ల‌దించుకునేలా చేశానిలా..

కుటుంబ నేప‌థ్యం :
ఐపీఎస్ ర‌మేష్ రెడ్డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా జాల్లపాలెం అనే చిన్న పల్లెటూరుకు చెందిన వారు. వీరి తండ్రి తిరుపతి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వార్డెన్.

ఎడ్యుకేష‌న్ :

IPS Ramesh Reddy

పేద, మధ్య తరగతి కుటుంబాలలో పుట్టిన పిల్లలకు జ్ఞానమే ఆస్థి. మొదట డాక్టర్ అవ్వాలనుకుని ఎంసెట్ రాశారు. దీనిలో 1,461 వ ర్యాంక్ వచ్చినా.. ఎంబీబీఎస్‌ సీట్ రాలేదు. కాని బాపట్లలో బీఎస్సీ అగ్రికల్చర్ సీటు మాత్రం లభించింది.

IPS Success Story : ఈ అసంతృప్తితోనే.. ఐపీఎస్ సాధించా.. కానీ..

ఎంబీబీఎస్‌ లో సీటు రాలేదని నిరాశపడ్డారు. కానీ బీఎస్సీ చదువుతున్నప్పుడు అక్కడి వాతావరణం, అక్కడ ఎంతోమంది సివిల్స్ రాసిన చరిత్ర ఉండడంతో నెమ్మదిగా సివిల్స్ మీద మమకారం పెరిగింది. భవిషత్తులో ప్రభుత్వ అధికారిగా కావాల‌నుకున్నారు. ఆ కలను చేరుకోవాలంటే ఓ వారధి కావాలి ఆ వారధే శ్రమ. అవును శ్రమ ఖచ్చితంగా తాను ఊహించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని బలంగా నమ్మారు. అనుకున్న‌ట్టుగానే డిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు.

IPS Success Story : ఇంట్లో చెప్ప‌కుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..

సివిల్స్‌లో పోరాటం ఇలా..

Ramesh Reddy IPS Success Story

ర‌మేష్ రెడ్డి.. మొదటి సారి ప్రిలిమ్స్‌లోనే క్వాలిఫై కాలేదు. రెండోసారి మాత్రం ఇంటర్యూలో స‌క్సెస్ కాలేక‌పోయ్యారు. అలాగే మూడోసారి కూడా నిరాశే పలుకరించింది. ఇంక‌ మన భవిషత్తుకై మన కన్నా మన బంధువులు ఎక్కువ ఆరాటపడుతారు. ఎందుకంటే మనం ఓడిపోతున్నామా గెలుస్తున్నామా అని తెలుసుకుని కాల‌క్షేపం సమయంలో ముచ్చడించుకోవడానికి. అంతే కాని మన బాధలు మాత్రం ఏమాత్రం పంచుకోరు. కాని వారు కూడా మనల్ని భయంకరంగా మోటివేట్ చేస్తారు.. మనం పాజిటీవ్ ఆలోచిస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది.

Success Story: ఈ లెక్కలే.. న‌న్ను 'ఐఏఎస్‌' అయ్యేలా చేశాయ్‌.. ఎలా అంటే..?

ఈసారి పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. తన ఓటమికి ఏ ఒక్కటి కూడా కారణం కాకూడదని భావించారు. ముందు సమయాన్ని కాపాడుకోవాలి మిత్రులతో ఎక్కువ కలవకూడదు అని చెప్పి గుండు చేయించుకున్నారు. తర్వాత ఒకవేళ కలవాలనుకున్నా గుండు చేయించుకుంటే ఎవ్వరిని కలవలేమని. ఒత్తిడి తగ్గించుకోవడానికి క్రికెట్ ఆడేవారు. అలాగే సెల్ ఫోన్ వాడడం పూర్తిగా మానేశారు. ఇలాంటి క్రమశిక్షణ కలిగిన ప్రణాళికతో నిరంతర శ్రమతో ఈసారి పరీక్ష రాసి.. జాతీయ స్థాయిలో 54వ ర్యాంక్ సాధించారు.

Success Story : ఈ జ‌వాన్‌.. చివ‌రికి ఐఏఎస్ కొట్టాడిలా.. నా ఆరాటం..పోరాటం ఇదే..

అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి..

IPS Ramesh Reddy Story in Telugu

ఉన్నత స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వారి కంటే అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినవారికి అన్నిరకాల కష్టాలు భావోద్వేగాలు తెలుస్తాయి. రమేష్ రెడ్డి గారి జీవన ప్రయాణం ఆ దారుల నుంచే జరిగింది కాబట్టే ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. మొక్కలు నాటడం దగ్గరి నుంచి పిల్లల చదువులకు ఆర్ధికంగా అండగా నిలబడడం వరకు అంతా తన ఉద్యోగంలో భాగంగానే నెరవేరుస్తున్నారు. జీవితంలో కష్టాలు రావడం ఒకరకంగా మన అదృష్టంమే. కష్టంలో నేర్చుకున్న పాఠం, కష్టంలో పుట్టే కసి, పట్టుదల మనల్ని ఉన్నతులను చేస్తుంద‌ని మరొక్కసారి చెప్పడానికి రమేష్ రెడ్డి గారి జీవితమే ఓ గొప్ప ఉదాహరణ.

Lady IPS Officer: తీవ్రవాదుల అడ్డాలో లేడీ ఐపీఎస్..ఈమె చూస్తే...

ఈయ‌న సేవాతత్వంలోనూ..

IPS Ramesh reddy social service

ఆయనకు హోదా అవసరం లేదు. మన, తన అన్న భేదం లేదు. ఉన్నది ఒక్కటే. అదే సేవాతత్వం. అదే ఆయన అభిమతం. ఆధ్యాత్మిక నగరం తిరుప‌తిలో నా అన్నవారు లేని ఓ అభాగ్యుడు యాచక వృత్తి సాగిస్తూ ఫుట్‌పాత్‌పై బతుకు సాగించేవాడు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయం ఎదుటే పడుకునేవాడు. నిత్యం ఆ దారిన ఎంతో మంది తిరుగుతున్నా పట్టించుకునే వారే కాదు. అతని దుస్థితిని చూసి తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి హోదాను సైతం పక్కనపెట్టేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యాచకుడిని పలకరించారు. సాదకబాధకాలు తెలుసుకున్నారు. అతన్ని మామూలు మనిషిని చేయాలని సంకల్పించారు. వెస్ట్‌ సీఐ నేతృత్వంలో అతనికి జుట్టు కత్తిరించి, కొత్తబట్టలు వేసి, భోజనం పెట్టి ఆశ్రమంలో చేర్పించారు. ప్రతి ఒక్కరూ ఒకపూట అనాథలకు భోజనం పెట్టాలని కోరారు. ఆ మేరకు పోలీసులు ఎస్పీ బాటలో పయనిస్తున్నారు.

 Success Story : ఎలాంటి ఒత్తిడి లేకుండా సివిల్స్ కొట్టానిలా.. నా రికార్డును నేనే..

Published date : 15 Dec 2022 04:45PM

Photo Stories