IPS Success Story : నన్ను విమర్శించిన వారే.. ఇప్పుడు తలదించుకునేలా చేశానిలా..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ పరీక్షలకు హాజరై మంచి ర్యాంక్ సాధించి.. ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో ఇమ్లా అఫ్రోజ్ ఐపీఎస్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
ఇమ్లా అఫ్రోజ్..ఒక పల్లెటూరి అమ్మాయి. వీరిది ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుందార్క్. వీరి నాన్న రైతు. ఈమెకు 14 ఏళ్లు ఉన్నప్పుడు ఆయన ఆకస్మికంగా మరణించారు. తల్లే ఒంటి చేత్తో తననీ, తమ్ముడినీ సాకింది. అమ్మ కష్టాన్ని చూస్తూ పెరిగింది ఇమ్లా.
ఎడ్యుకేషన్ :
అమ్మ కష్టాన్ని తలుచుకుంటూ.. ఇమ్లా పట్టుదలగా చదివేది. దానికి ప్రతిఫలంగా యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌తో చదువుకునే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఇంట్లోనేమో అక్కడికి వెళ్లడానికి ప్రయాణ ఖర్చులకు కూడా లేని పరిస్థితి. అయినా కూడా వీరి అమ్మ వెనకడుగు వేయలేదు. కష్టపడి డబ్బును సమకూర్చింది. ఇది చూసి చాలామంది తాహతుకు మించి ప్రయత్నించొద్దనేవారు. ఆడపిల్లను అంత దూరం ఒంటరిగా పంపితే అక్కడేం చేస్తుందో, ఏం తలవొంపులు తెస్తుందోనని భయపెట్టేవారు. కానీ ఇమ్లా తనను తాను నిరూపించుకుంటానన్ని ముందుకు వెళ్లింది.
Success Story : ఈ జవాన్.. చివరికి ఐఏఎస్ కొట్టాడిలా.. నా ఆరాటం..పోరాటం ఇదే..
మంచి ఉద్యోగాన్ని కాదని.. సివిల్స్ వైపు ప్రయణం..
తన తలరాతను తనే మార్చుకోవాలని కష్టపడి చదివింది. అమ్మ నమ్మకాన్ని నిలబెడుతూ ఇమ్లా విజయవంతంగా చదువు పూర్తిచేసింది. ఆమె శ్రమకు తగ్గట్టే యూఎస్‌లో మంచి ఉద్యోగాన్నీ సంపాదించింది. ఆర్థిక కష్టాలు గట్టెక్కాయి. కానీ ఆమె మనసు మాత్రం దేశంపైనే! దీంతో ఉద్యోగాన్ని కాదని సివిల్ సర్వీసెస్ అందుకుంది. తన మార్గాన్ని తానే వేసుకుని ఇప్పుడెంతో మంది అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.. ఇమ్లా అఫ్రోజ్!
Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేరయ్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..
ఐపీఎస్ ఆఫీసర్‌గా..
సమాజానికి.., తనలాంటి వారికి ఏదైనా చేయాలని తాపత్రయపడుతూ ఉండేది. కొన్నాళ్లు ఈ సంఘర్షణ తన మనసులో సాగింది. చివరకు తిరిగొచ్చేసింది. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌కు ప్రయత్నించి మంచి ర్యాంకు సాధించింది. ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది.
ప్రశ్నించిన వారే ఇప్పుడు తనను చూసి ..
వీరి గ్రామంలో ‘హోప్’ అనే సంస్థను ప్రారంభించి, పేద పిల్లలకు ఉచిత విద్యనందిస్తోంది. ఒకప్పుడు అమ్మాయికి పెద్ద చదువులెందుకు? అంత దూరం పంపడం అవసరమా అని ప్రశ్నించిన వారే ఇప్పుడు తనను చూసి గర్వపడుతున్నారు. తన సేవలను పొగుడుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన కలను సాకారం చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు సాగడమే కాక మరెందరికో సాయమందిస్తోన్న ఇమ్లా ఎందరికో ఆదర్శవంతమేగా మరి!