IAS Success Story : ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్.. చివరికి ఐఏఎస్ కొట్టానిలా..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరిక్షలో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే గానీ మంచి ర్యాంక్ సాధించలేరు. ఇలాంటి కష్టమైన పరీక్షలో.. మూడుసార్లు మంచి ర్యాంకు సాధించలేక విఫలమైన ప్రఖర్.. నాలుగో సారి మరింత కష్టపడి ఆల్ ఇండియా సివిల్స్‌లో 90వ ర్యాంకు సాధించాడు. ఈ యూపీఎస్సీ సివిల్స్ ప్రిపరేషన్ అనుభవాన్ని ఈయన మాటల్లోనే..
☛➤ IPS Anjali Success Story : అంజలి విశ్వకర్మ.. ఐపీఎస్ సక్సెస్ స్టోరీ.. నా వెనుక ఉన్నది వీళ్లే..
కుటుంబ నేపథ్యం :
ప్రఖర్ జైన్.. తండ్రి రాకేష్ జైన్ కొత్వాలి సదర్ ప్రాంతంలోని నజైబజార్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తల్లి గృహిణి. ముగ్గురు సోదరులలో పెద్దవాడైన ప్రఖర్ జైన్ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో కీలకం ఉండేవారు.
ఎడ్యుకేషన్ :
ప్రఖర్ జైన్.. తన ప్రాథమిక విద్యను ఎస్‌డీఎస్ (SDS) కాన్వెంట్ స్కూల్ లలిత్‌పూర్ నుంచి పూర్తి చేసారు. మధ్యప్రదేశ్‌లోని విదిషాలోని న్యూ జైన్ హయ్యర్ సెకండరీ స్కూల్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు. అలాగే అతను 2016 లో కాన్పూర్ ఐఐటీ (IIT) నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత అతను గుర్గావ్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేరాడు. కానీ ఆ ఉద్యోగం కన్నా.. సివిల్స్ పూర్తి చేయడమే తన ముందు ఉన్న లక్ష్యంగా పెట్టుకున్నాడు. తనకు చదువుపై ఎప్పుడూ ఆసక్తి ఉండేది. పాఠశాలలో చదివినా, ఏదైనా పోటీలోనూ ఎప్పుడూ ముందుండేవాడు. అతనికి కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించింది. దానివల్ల చదువుపై దృష్టి నిలిచింది.
☛➤ IPS Success Story : రూ.20 లక్షల ప్యాకేజీకి టాటా చెప్పింది.. ఐపీఎస్‌కు వెల్‌కమ్ చెప్పిందిలా..
యూపీఎస్సీ సివిల్స్‌కు ఇలా..
ప్రఖర్ జైన్.. గతేడాది మూడో ప్రయత్నంలో ప్రఖర్‌కి 693వ ర్యాంకు వచ్చింది. అయితే.. అది అతనికి పూర్తిగా సంతృప్తినివ్వలేదు. దాని కారణంగా అతనికి డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ కేడర్ లభించింది. కానీ అతను సర్వీస్ నుంచి సెలవు తీసుకుని.. మళ్లి ప్రిపరేషన్ కొనసాగించాడు. చివరికి నాలుగో సారి ప్రయత్నించి.. యూపీఎస్సీ సివిల్స్‌లో ఆల్ ఇండియా 90వ ర్యాంక్ సాధించాడు. ఇప్పుడు ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు.
నా విజయంలో కీలక పాత్ర వీరిదే..
నాలుగుసార్లు తాను యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు ప్రయత్నించానంటే.. కేవలం తన కుటుంబం వల్లే అని అతను చెప్పడం విశేషం. ఒక్కోసారి ఇక చాలు అని తనకు అనిపించేదని కానీ.. తన తల్లిదండ్రులు మాత్రం తనకు ఎనలేని ధైర్యం ఇచ్చేవారని చెప్పాడు. యూపీఎస్సీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో ఒక్కోసారి నిరాశ కలిగేదని.. తాను మొదటి రెండు ప్రయత్నాల్లో కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయ్యారు. రెండోసారి తాను చాలా డీలా పడిపోయానని చెప్పారు. అయితే.. తన తమ్ముడు తనకు ధైర్యం ఇచ్చానని చెప్పాడు.
➤☛ Inspirational Success Story : నిజంగా.. ఈ కలెక్టర్ స్టోరీ మనకు కన్నీరు పెట్టిస్తోంది..
ఫెయిల్ కావడంతో.. చాలా ఒత్తిడి ఉండేదని..కానీ
రెండుసార్లు ఫెయిల్ కావడంతో.. చాలా ఒత్తిడి ఉండేదని.. కానీ ఇప్పుడు అనుకున్నది సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఆ ఒత్తిడి తగ్గించడానికి తన తమ్ముడు సహాయం చేశాడు. సివిల్స్ ఇంటర్వ్యూ కోసం దాదాపు 7గంటల పాటు ఎదురు చూశానన్నారు.
☛➤ IAS Success Story : కూలీనాలీ చేస్తూ చదివాడు.. ఐఏఎస్ సాధించాడు.. కానీ ఈయన పెళ్లి మాత్రం..