IPS Success Story : రూ.20 లక్షల ప్యాకేజీకి టాటా చెప్పింది.. ఐపీఎస్‌కు వెల్‌కమ్ చెప్పిందిలా..
అనుకున్నట్టు గానే.. ఈమె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు ప్రిపేరైంది. సివిల్స్‌లో 191వ ర్యాంక్ సాధించింది. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇషా సింగ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం..
ఇషా సింగ్.. తండ్రి వైపి సింగ్ జౌన్‌పూర్‌లోని రామ్‌నగర్ డెవలప్‌మెంట్ బ్లాక్ ప్రాంతంలోని జవాన్సీపూర్ గ్రామ నివాసి. ఈయన ముంబైలో పోలీసు అధికారిగా విధులు నిర్వహించారు. ఈమె తల్లి న్యాయవాది. ఇషా సింగ్ చిన్ననాటి నుంచి తన తండ్రి పనిని నిశితంగా గమనిస్తూ పెరిగారు. తన తండ్రి ప్రజలకు చేస్తున్న సేవకు ఆమెకు ఎంతగానో నచ్చింది. అప్పటి నుంచి ఆమెకు సామాజిక సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నది. చిన్న తనంలోనే ఐపీఎస్ కావాలనుకున్నది. అనుకున్నట్టు గానే ఆ కల ఇప్పుడు తీరింది.
UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాపర్ శృతి శర్మ.. సక్సెస్ సిక్రెట్ ఇదే..
యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపరేషన్ ఇలా..
ఇషా చిన్న తనంలో పెద్దగా చదివేది కాదట. తర్వాత చాలా కష్టపడి చదివినట్లు ఆమె చెప్పారు. ఎకనామిక్స్, పాలిటిక్స్, జాగ్రఫీ, జనరల్ స్టడీస్ హిస్టరీ వంటి అన్ని సబ్జెక్ట్‌లను చదివితే.. అది జ్ఞానాన్ని పెంచుతుందని.., ఇది ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. యూపీఎస్సీ చదివిన తర్వాత ఎవరిలోనైనా కచ్చితంగా మార్పు వస్తుందని.. జ్ఞానం పెరుగుతుందని ఇషా చెప్పారు. తాను ఉదయం వేళల్లో ఎక్కువగా చదవడానికి ఇష్టపడతానని ఆమె తెలిపారు. ఎందులోనైనా విజయం సాధించాలన్నా.. సంకుచిత మనస్తత్వాన్ని వదిలిపెట్టాలని ఆమె తెలిపారు.
Success Story: ఈ లెక్కలే.. నన్ను 'ఐఏఎస్' అయ్యేలా చేశాయ్.. ఎలా అంటే..?
యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేరయ్యే వారు చేయాల్సినవి.. చేయకూడనివి.. ఇవే..
యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు.. సంకుచిత మనస్తత్వంతో ఉండవద్దు. ఈ పరీక్షను ఇలా ఇస్తున్నానని కొందరు అంటున్నారు. ఈ పరీక్ష చాలా కష్టం అని చాలా మంది అంటున్నారు. ఈ రకమైన ఆలోచనల నుంచి దూరంగా ఉండండి. మీ స్వతహాగా మనస్సును ఏర్పరచుకోండి. మీ బలాలు.., బలహీనతలను విశ్లేషించండి. రెండవ విషయం ఏమిటంటే.. ఎక్కువ విషయాలపై వెళ్లవద్దు.., ఎందుకంటే ఒక వ్యక్తి దానిలో మునిగిపోయేలా చాలా విషయాలు వస్తూనే ఉంటాయి. కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టండి. న్యూస్ పేపర్‌ను ఎక్కువగా చదవండి. మీ ఉత్సుకత పెంచండి. స్టడీ మెటీరియల్ తక్కువగా ఉంచండి, అభ్యాసాన్ని పెంచండి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను గమనించండి.
Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే.. ఐపీఎస్ అయ్యానిలా..