Skip to main content

Mensuration Leave : ఉద్యోగినుల‌కు నెల‌స‌రి సెల‌వులపై శుభ‌వార్త‌.. కీల‌క ప్ర‌క‌ట‌న‌!

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగినులకు ఒకరోజు నెలసరి సెలవు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఒడిశా ప్ర‌భుత్వం..
Odisha Deputy Chief Minister Pravathi Parida announcing monthly leave for employees  Odisha Deputy Chief Minister Pravathi Parida announcing monthly leave for employeesOdissa government announces good news for working women on mensuration leaves

సాక్షి ఎడ్యుకేష‌న్‌: దేశంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగినులకు ఒకరోజు నెలసరి సెలవు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కటక్‌లో జరిగిన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.

Indian Students : అంత‌ర్జాతీయ స్థాయి వ‌ర్క‌షాప్‌లో పాల్గొన్న‌ భార‌త విద్యార్థినులు..

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సే లక్ష్యంగా నెలసరి సెలవుల్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రవితా పరిదా తెలిపారు. ఈ విధానంలో మహిళా ఉద్యోగులు వారి నెలసరి సమయంలో మొదటి లేదా రెండవ రోజు సెలవు తీసుకోవచ్చని అన్నారు. 

ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్‌  ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. అంతేకాదు, నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్‌ పాలసీని రూపొందించాలని గత నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది.

MBA Admissions 2024: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 17 Aug 2024 09:47AM

Photo Stories