Success Story : సొంతూరికీ వెళ్లకుండా చదివా.. అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం కొట్టానిలా..
ఇది ఎంతలా ఉంది అంటే.. అనుకున్నది సాధించే వరకు సొంత ఊరికూడా అడుగు పెట్టకూడదని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టే నాలుగేళ్లగా సొంతూరి ముఖం చూడలేదు. ఎంతో కష్టపడి చదివి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ISS మూడో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో జైప్రకాష్ సాహ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
జైప్రకాష్.. బీహార్‌లోని చంపారన్ జిల్లా, మఝౌలియా బ్లాక్‌లోని జోకాటియా పంచాయతీకి చెందినవాడు. జైప్రకాష్.. తండ్రి కన్హయ్య సాహ. ఈయన వృత్తిరీత్యా వడ్రంగి. పనుల కోసం ఈయన ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు. చాలా కాలం బయటి ప్రాంతాల్లోనే పనిచేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో కూలీగా పనిచేస్తున్నారు. జైప్రకాష్ తల్లి గాయత్రీ దేవి. ఈమె గృహిణి. ఈమె కుటుంబ పోషణ కోసం మేకలను మేపుతారు. ఈయనకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారు గ్రామంలోనే ఉండి చదువుకుంటున్నారు. ఆర్థిక భారం పెరుగుతున్నా తండ్రి తన ఆశయాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు.
ఎడ్యుకేషన్ :
జైప్రకాష్.. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే జరిగింది. 2012లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం పాట్నా సైన్స్ కాలేజీలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఏసీ పూర్తి చేశాడు. అప్పటి వరకు తండ్రి సంపాదనపైనే ఆధారపడిన అతను.. MAC డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఒక కంపెనీకి ఫ్రీలాన్సింగ్ చేయడం ప్రారంభించాడు. ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటూ, చదువును కొనసాగించాడు.
➤☛ UPSC Ranker Success Story : ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై నడిచేలా చేశాయ్.. నా వైకల్యం కారణంగా..
ప్రిపరేషన్ కోసం..
దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా భావించే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ISS ఎగ్జామ్‌లో భారతదేశం నలుమూలల నుంచి మొత్తం 29 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో జై ప్రకాష్ 27వ స్థానంలో నిలిచారు.
ఈయన స్టోరీని అందరూ స్ఫూర్తిగా తీసుకోవచ్చు..
జైప్రకాష్ నుంచి.. అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అతడు మొదటి నుంచి ఒకే ఒక లక్ష్యంపై దృష్టి పెట్టాడు. మొత్తం మూడుసార్లు ISS ఎగ్జామ్‌ను రాసి.. చివరి ఎగ్జామ్‌లో అనుకున్నది సాధించాడు. అయితే అంతకు ముందే, గవర్నమెంట్ ఆఫీసర్ అయిన తర్వాతే స్వగ్రామంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. గత నాలుగేళ్లుగా జైప్రకాష్ సొంతూరిలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు అతని విజయానికి కుటుంబ సభ్యులే కాదు, ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారు. నేను విజయం సాధించానంటే.. తల్లిదండ్రుల శ్రమే కారణమన్నాడు.