Sadaf Choudhary IAS Success Story : ఆ కట్టుబాట్లను చెరిపేసి.. అనుకున్నట్టే కలెక్టర్ ఉద్యోగం సాధించానిలా.. చివరికి..
ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ.. ఆ కట్టుబాట్లను చెరిపేసి.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించి.. అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె పేరే సదాఫ్ చౌదరి. ఈ నేపథ్యం యూపీఎస్సీ సివిల్స్‌లో 23వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కొట్టిన సదాఫ్ చౌదరి సక్సస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
సదాఫ్ చౌదరి.. ఉత్తరాఖండ్‌లో అమ్రోహాలోని జోయా పట్టణానికి చెందిన వారు. తండ్రి మహ్మద్ ఇస్రార్, తల్లి షాబాజ్ బానో. సోదరి సైమా.
ఎడ్యుకేషన్ :
సదాఫ్ చౌదరి.. చిన్నతనంలో వార్తాపత్రికలను బాగా చదివేవారు. ముస్లిం కుటుంబాలలో మహిళలు ఉన్నత చదువులు చదవడానికి పెద్దలు అంగీకరించరనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే.. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ.. ఆ కట్టుబాట్లను చెరిపేసి.. అనుకున్న లక్ష్యాన్ని తన చదువుతో సమాధానం చెప్పింది.
Success Story : సొంతూరికీ వెళ్లకుండా చదివా.. అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం కొట్టానిలా..
ఇందుకే.. కలెక్టర్ అవ్వాలనుకున్నా..
ప్రజలకు ఏ సమస్య వచ్చినా.., ఏది కావాలన్నా.. కలెక్టర్ దగ్గరకే వెళ్తారనే విషయం తెలుసుకున్నాను. అందుకే.. నేను కూడా కలెక్టర్ కావాలనే నిర్ణయం అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. చివరకు అనుకున్నట్టే సాధించాను.
ఆ కట్టుబాట్లను చెరిపేసి..
ముస్లిం కుటుంబాలలో మహిళలు ఉన్నత చదువులు చదవడానికి పెద్దలు అంగీకరించరనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే.. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ.. ఆ కట్టుబాట్లను చెరిపేసి.. యూపీఎస్సీలో 23వ ర్యాంకు సాధించింది. ఈ ఘనత సాధించడానికి పడిన కష్టాన్ని స్వయంగా తన మాటలతో తెలిపారు.
➤☛ UPSC Ranker Success Story : ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై నడిచేలా చేశాయ్.. నా వైకల్యం కారణంగా..
నేను వచ్చిన నేపథ్యంలో.. చాలా వరకు ముస్లిం అమ్మాయిలు పెద్దగా చదువుకోలేదని ఆమె చెప్పారు. అయితే.. వీటి అన్నింటికి భిన్నంగా.. ఈ ఘనత సాధించాను. తనలాంటి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.
పెళ్లి చేసుకోమని.. భర్తను జాగ్రత్తగా చూసుకుంటే చాలు అన్నారు.. కానీ..
తనను ఇంట్లో పెళ్లి చేసుకోమని.. భర్తను జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని చెబుతూ ఉండేవారని.. ఉద్యోగం లాంటివి ఏమీ వద్దు అని అంటూ ఉండేవారని ఆమె చెప్పారు. అయితే.. అవన్నీ కాకుండా.. తాను ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉండేదాన్ని. దాని కోసమే.. తన లాంటివారికి ఒక రోల్ మోడల్ కావాలని నిర్ణయం తీసుకున్నాను. ఇందు కోసం నేను ఎంతోకష్టపడ్డానని చెప్పింది.
నా విషయంతో క్రెడిట్ వీరిదే..
నా విజయంలో క్రెడిట్‌ని తన తండ్రి మహ్మద్ ఇస్రార్‌కు, తల్లి షాబాజ్ బానోకు ఇచ్చారు. ఎందుకంటే.. ఇలా ఎందుకు చేస్తున్నావు.. అని ఏ రోజు వాళ్లు తనను ఎదురు ప్రశ్నించలేదు. నా సోదరి సైమా కూడా తనకు ఎంతోగానో సహకరించింది. తన విజయంలో స్నేహితుల పాత్ర కూడా ఎక్కువగా ఉందన్నారు.
నా యూపీఎస్సీ సివిల్స్ పోరాటం ఇలా..
సదాఫ్.. ఇంట్లోనే ఉంటూనే.. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు ప్రిపేరయ్యారు. దీని కోసం రెండేళ్లు పాటు కష్టపడ్డారు. తను చదువుతున్న సమయంలో ఎవరితోనూ అంతగా ఇంటరాక్షన్ ఉండేది కాదని చెప్పింది. అలాగే పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్నప్పుడు.. చదువుకోవడానికి వనరులు లేని చోట పెద్దగా మార్గదర్శకత్వం ఉండదు. ఎన్నో వైఫల్యాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. నేను నా లక్ష్యం కోసం భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని ప్రిపేరయ్యాను. మొదటి సారి ప్రిలిమ్స్ ఫెయిల్. తర్వాత ప్రయత్నంలో ఎంతో కసిగా చదివాను. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తన జర్నీ చాలా సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. ఈ ప్రయాణం తన వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చాలా నేర్పింది.
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి
ఇలా సమయం కలిసి వచ్చింది...
సదాఫ్ చౌదరి.. ఇంటర్వ్యూకి ముందు చాలా నమ్మకంగా ఉందట. ఇంటర్వ్యూకు ముందు మాక్ ఇంటర్వ్యూ వెళ్లారు. ఇందులో మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరోవైపు, కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంటర్వ్యూ కొంతకాలం వాయిదా పడింది. ఈ కారణంతో.. ప్రిపరేషన్ కోసం చాలా సమయం దొరికింది. దీనిని సద్వినియోగం చేసుకుంది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయినందున.. ఇంటర్వ్యూ బోర్డును ఎదుర్కొనే భయం లేదు అని చెప్పింది. ఆమె ఇంటర్వ్యూ దాదాపు 35 నిమిషాలపాటు సాగింది. ఈ ఇంటర్వ్యూలో సక్సెస్ అయింది. తను అనుకున్నట్టే.. మంచి ర్యాంక్ సాధించి కలెక్టర్ అయ్యారు.
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...