Skip to main content

AP Government Jobs Notifications 2025 : ఈ శాఖలో 26000పైగా జాబ్స్‌.. నోటిఫికేష‌న్ ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. పీహెచ్‌సీలు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో కలిపి 708 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 9,978 పారామెడికల్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
AP Government Jobs Notifications 2025

బోధనాసుపత్రుల్లో 10,065 పారామెడికల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ, నర్సులు, ఇతర ఉద్యోగాలున్నాయి. ఐసీయూల్లోనూ నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ఇలా  మొత్తం మీద 23,150  మెడిక‌ల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

➤☛ Medical Jobs 2025 : 4,597 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ.. అర్హ‌త‌లు ఇవే..!

పారామెడికల్‌ పోస్టులు...

వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల పరిధిలో వైద్యులు, పారామెడికల్‌ ఉద్యోగాల ఖాళీలు 25.97 శాతం ఉన్నాయి. నిర్ణీత 1,01,125 ఉద్యోగాలలో 3,114 వైద్యులు, 23,150 పారామెడికల్‌ ఉద్యోగులు లేరు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ (డీఎస్‌హెచ్‌), డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ (డీహెచ్‌), ఆయుష్, జాతీయ ఆరోగ్యమిషన్‌లలో ఖాళీ పోస్టుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సేకరించింది. వీటిలోని ఖాళీలను అవసరాల మేరకే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాధాన్య క్రమంలో తొలుత ఏడెనిమిది వేల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోనుంది. 

5,749 పోస్టులు మంజూరుకాగా...

ap ogverment jobs

ఆయుష్‌ కింద ఆయుర్వేద, హోమియో, యునాని ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. ఇందులో 825 వైద్యుల పోస్టులకుగాను 407 ఖాళీలు ఉన్నాయి. కాంపౌండర్లు, అటెండర్లు, ఇతర అవసరాలకు కలిపి 1,601 ఉద్యోగాలు మంజూరుకాగా 1,131 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతున్నాయి. 5,749 వైద్యుల పోస్టుల మంజూరుకాగా 1,484 ఖాళీగా ఉన్నాయి. సూపర్‌స్పెషాలిటీ వైద్యుల భర్తీ కోసం కొన్ని చోట్ల దరఖాస్తులు రావడం లేదు. విజయవాడ జీజీహెచ్‌లో 314 వైద్యుల పోస్టులకుగాను 46 ఖాళీగా ఉన్నాయి. మెడికల్, సర్జికల్‌ ఆంకాలజీ విభాగాల్లో నాలుగు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Published date : 18 Jan 2025 11:46AM

Photo Stories