Skip to main content

Indian Oil Corporation Limited jobs: డిగ్రీ అర్హతతో IOCL లో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ జాబ్స్ జీతం నెలకు 1,40,000

Indian Oil Recruitment 2025   Indian Oil Corporation Limited Hiring 97 Quality Control Officers   Indian Oil Corporation Limited jobs   IOCL Quality Control Officer Recruitment 2025 Notification
Indian Oil Corporation Limited jobs

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) లో 97 పోస్టులుతో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మార్చి 1వ తేదీ నుండి మార్చి 21వ తేదిలోపు అప్లై చేయాలి.

10వ తరగతి అర్హతతో GST కమిషనర్ కార్యాలయంలో అటెండర్ జాబ్స్ జీతం నెలకు 56,900: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు : క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు : 
ఇనార్గానిక్ లేదా ఆర్గానిక్ లేదా అనలైటికల్ లేదా ఫిజికల్ లేదా అప్లైడ్ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
SC / ST / PwBD అభ్యర్థులు అయితే కనీసం 55% మార్కులు, GEN / OBC(NCL) / EWS అభ్యర్థులు అయితే 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.

జీతం వివరాలు : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000/- నుండి 1,40,000/- వరకు ఉండే పేస్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. 

ఎంపిక విధానం : అర్హత ఉన్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపి చేస్తారు.

అప్లికేషన్ ఫీజు : 
GEN / OBC(NCL) / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 600/- రూపాయలు
SC / ST / PwBD / ESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. 

వయస్సు : ఈ పోస్టులకు 28-02-2025 తేది నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు : 
SC / ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు వయస్సు 10 సంవత్సరాల వయస్సు ఉండాలి. 

అప్లై విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

అప్లికేషన్ చివరి తేదీ : అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో 21-03-2025 తేదిలోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ తేదీ : ఏప్రిల్ 2025 లో పరీక్ష తేది నిర్వహిస్తారు.

Download Notification: Click Here

Apply Online: Click Here

Published date : 05 Mar 2025 08:38AM

Photo Stories