Skip to main content

Bima Sakhi Yojana: ‘బీమా సఖీ యోజన’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది.
LIC Bima Sakhi Yojana Details  Prime Minister Modi launching LIC Bima Sakhi Yojana in Panipat

డిసెంబర్ 9వ తేదీ హరియాణాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్‌ఐసీ తెలిపింది.

కీలక అంశాలు..
అర్హులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన 18-70 సంవత్సరాల వయస్సు గల మహిళలు.
శిక్షణ, ఉపాధి: బీమా సఖీలుగా పిలువబడే మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.

Oxford University: ‘ప్రగతి’ సూపర్‌ సక్సెస్.. పీఎం ప్రతిష్టాత్మక పథకంపై ఆక్స్‌ఫర్డ్ ప్రశంసలు

ఆర్థిక సహాయం: ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండో సంవత్సరంలో రూ.6,000, మూడో సంవత్సరంలో రూ.5,000 పొందవచ్చు. అదనంగా రూ.2,100 ప్రోత్సాహకం లభిస్తుంది.

బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమీషన్ రూ.48,000 వరకు ఉంటుంది.

Sakhi Depot: దేశంలోనే తొలి మహిళా బస్‌ డిపో ప్రారంభం.. ఎక్క‌డంటే..

Published date : 11 Dec 2024 08:53AM

Photo Stories