Skip to main content

Mother and Daughters : స్టేజీపై స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన త‌ల్లీ కూతుర్లు..

పాఠ‌శాల‌లో త‌ల్లీ కూతుర్ల డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే..
Mother and daughters dance steps on stage in zph school  Mother and children performing a dance at ZPHS School cultural program

సాక్షి ఎడ్యుకేష‌న్: పాఠ‌శాల‌ల్లో ఏదైనా ఫెస్ట్‌, ప్రోగ్రామ్‌, లేదా ఏదైనా పండుగ జరుపుకుంటే విద్యార్థులంతా పాట పాడ‌డం, డ్యాన్సులు చేయ‌డం, లేదా ఎంకేదైనా చేస్తుంటారు. ఈ ప్రోగ్రాంల‌కు త‌ల్లిదండ్రులు కూడా హాజ‌రై వారి పిల్లలు చేసే ప‌ర్ఫామెన్స్‌ను చూసి మురిసిపోతుంటారు. ఇది వింతేం కాదు. ఇందులో కొత్త విష‌య‌మూ లేదు. కానీ, త‌ల్లిదండ్రులు చూడ‌డ‌మే కాకుండా ఏకంగా వారి పిల్ల‌ల‌తో క‌లిసి ప‌ర్ఫాం చేస్తే.. ఎలా ఉంటుందంటారు..? ఇక్క‌డ జ‌రిగింది ఇదే..

Medical Jobs: ఏపీ మెడికల్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో పోస్టులు.. నెల‌కు రూ. 1.50 ల‌క్ష‌ల జీతం..

ఏపీలోని అన‌కాప‌ల్లి జిల్లాలో కోటవురట్ల మండలం జల్లూరు గ్రామ జెడ్‌పీహెచ్ఎస్‌ పాఠశాలలో ఆదివారం పేరెంట్స్ టీచ‌ర్స్ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ ప్రోగ్రామ్‌లో పాఠ‌శాల పిల్ల‌లంతా ఒక్కో రకంగా ప‌ర్ఫాం చేశారు.

MHLP Recruitment : ఎంహెచ్ఎల్‌పీ భ‌ర్తీలో అవ‌క‌త‌వ‌క‌లు.. కార‌ణం ఇదేనా..?

అందులో ఇద్దరు విద్యార్థినులు కూడా సినీ యాక్ట‌ర్ సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ నటించి స్వర్ణకమలం సినిమాలోని ఆకాశంలో ఆశ‌ల హ‌రివిల్లు.. (Aakasamlo Aasala harivillu) అనే పాట‌కు డ్యాన్స్ చేశారు. వీరిని చూసిన త‌న త‌ల్లి కూడా స్టేజీ ఎక్కి వారితోపాటు స్టెప్పులు వేసింది. ఇది చూసినవారంతా ఆశ్చ‌ర‌పోయారు. అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు, టీచర్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసినవారంతా ఆ త‌ల్లికి ప్ర‌శంస‌లు అందిస్తున్నారు. ఎంతో బాగా చేశార‌ని కొంద‌రు. త‌న ధైర్యాన్ని మెచ్చుకున్న‌వారు మ‌రికొంద‌రు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 10 Dec 2024 01:31PM

Photo Stories