Tenth Students : విద్యార్థులకు అర్థమైయ్యేలా బోధించాలి..

సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులు తమ ఫైనల్ ఎగ్జామ్స్లలో అత్యధిక మార్కులు సాధించేందుకు వారి ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థులను ప్రోత్సాహించాలి అని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం నాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఆంగ్ల ఐపాస్-2025 బుక్స్ ఆవిష్కరణకు కలెక్టర్ ఎల్టా ప్రతినిధులతో కలిసి హాజరైయ్యారు. వారే ఐపాస్-2025ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ప్రోత్సాహికంగా మాట్లాడారు.. విద్యార్థులుకు ఇంగ్లీష్‌పైనే కాదు, ఎటువంటి విద్య పొందడానికైనా, ఏ సబ్జెక్ట్‌కూ భయం కలగకుండా ఇష్టంగా నేర్చుకునేలా వారి ఉపాధ్యాయలు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. పరీక్ష సమయంలో ప్రతీ ఒక్కరూ నిర్భయంగానే ఉండి పూర్తి చేయాలన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో ఎం. వెంకటేశ్వరాచారి, ఎల్టా ప్రతినిధులు దస్తగిరి, షేక్ జహంగీర్, మేరెడ్డి ఇంద్రసేనారెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా ఈ నెల 21న కొత్తగూడెంలోని ఆనంద్ఖని జడ్పీహెచ్ఎస్ లో జిల్లా స్థాయి ఆంగ్ల ఒలంపియాడ్ పోటీలు నిర్వహించనున్నట్టు ఎల్టా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్దస్తగిరి, షేక్ మీరా హుస్సేన్ తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- School Students
- tenth students exams
- board exams preparations
- IPASS-2025 Books
- IPASS-2025 Books launch event
- tenth students exams encouragement
- Collector Jitesh V Patil
- Students
- school students education
- tenth education and exams
- tenth board exams 2025
- january 21st
- telangana tenth board exams 2025
- Education News
- Sakshi Education News