Skip to main content

Vocational Education Courses Fees : వృత్తి విద్య కోర్సుల ఫీజుల్లో మార్పులు.. ఈసారి 15 శాతం..!!

గతంలో వృత్తి విద్యా కోర్సుల‌కు అమలు చేసిన ఫీజుల కాలపరిమితి 2024-25తో ముగిసింది.
TAFRC New Fee Details Announcement 2025-26  Changes in vocational education courses fees for next 3 academic years

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ రాష్ట్ర‌లోని ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, న్యాయవిద్య, ఉపాధ్యాయ విద్యతో వంటి ఇద‌ర వృత్తి దాయ‌క కోర్సుల్లో ప్ర‌తీ మూడు సంవ‌త్స‌రాల‌కు టిఎఎఫ్‌ఆర్‌సి కొత్త ఫీజు వివ‌రాల‌ను ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఈసారి కూడా కొత్త ఫీజులు అమలులోకి రానున్నాయి తెలిపారు. గతంలో ఈ కోర్సుల‌కు అమలు చేసిన ఫీజుల కాలపరిమితి 2024-25తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే మ‌రో విద్యాసంవ‌త్స‌రం 2025-26 నుంచి 2027-28 వరకు అమలు కానున్న వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన కొత్త‌ ఫీజుల వివరాల‌ను ఈసారి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఖరారు చేయనున్నది. ఇక‌, 2025-26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది.

New Syllabus in Higher Education: ఉన్నత విద్యలో త్వరలో కొత్త సిలబస్‌.. కొత్త సిలబస్‌ ఇలా..

15 శాతం అవ‌కాశం..

ఈ మెర‌కు రాష్ట్రంలోని కళాశాలల్లో ఉండాల్సిన‌ మౌలిక వసతులు, అధ్యాపకులకు రావాల్సిన‌ వేతనాలతో కూడిన ఆదాయ, వ్యయాలను పరిగణలోకి తీసుకుని టిఎఎఫ్‌ఆర్‌సి ఈసారి ఫీజులను ఖరారు చేస్తుంది. ఈ ఫీజు వివ‌రాలు మ‌రో మూడేళ్ల వ‌ర‌కు ఇలాగే కొన‌సాగుతుంది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఫీజుల పెంపు ఉండే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితంతో పోల్చితే జ‌రిగిన మార్పులు, ప్ర‌వేశ పెట్టిన కొత్త నిబంధ‌న‌లు, వృత్తి విద్యా కళాశాలల నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రతి కోర్సులో కొంత ఫీజు పెంపు ఉంటుంద‌నే భావిస్తున్నారు కొంద‌రు అధ్యాప‌కులు.

కౌన్సెలింగ్ స‌మ‌యంలోనే..

రాష్ట్రంలోని కాలేజీల్లో ఉన్న‌ వృత్తి విద్యా కోర్సులకు జూన్ లేదా జూలైలో కౌన్సెలింగ్ నిర్వ‌హించే అవకాశం ఎక్కువే ఉన్నందున ఇక ఈ ఫీజుకు సంబంధించిన వివరాల‌ను కూడా టిఎఎఫ్‌ఆర్‌సి అప్పుడే ఖరారు చేస్తార‌ని తెలుస్తోంది. అయితే, కొన్ని క‌ళాశాల‌ల్లో ఫీజు రూ. లక్షకుపైగా ఉంది, మిగతా క‌ళాశాల‌ల్లో రూ. లక్షలోపు ఉంది.

8th Pay Commission Salary Structure : అటెండ‌ర్ నుంచి క‌లెక్ట‌ర్ స్థాయి వ‌ర‌కు జీతాలు ఎలా ఉంటాయంటే...?

60వేల నుంచి ఏకంగా..

ఈసారి 15 శాతం మేర ఫీజులు పెంచాలని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకు టిఎఎఫ్‌ఆర్‌సీ కూడా ఆమోదం తెలిపింది. ఈ కార‌ణం చేతే.. ఇంజనీరింగ్ క‌ళాశాల‌లో విద్యార్థుల‌కు వార్షిక ఫీజు కనిష్ఠంగా రూ. 60 వేల ఫీజును పెంచి రూ. 1.70 లక్షలకుపైగా చేసే అవకాశం ఉంది. అంటే, ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయడానికి రూ. 3 లక్షల నుంచి రూ. 8 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంది. 

వీటి ఆధారంగానే..

రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజుల ఖరారుకు గత మూడేళ్లలో కాలేజీల నిర్వహణ వ్యయంతోపాటు మౌలిక సదుపాయాల విస్తరణ, విద్యాప్రమాణాల మెరుగుదలకు చేసిన ఖర్చు వివరాలను యాజమాన్యాలు టిఎఎఫ్‌ఆర్‌సీకి ఇవ్వాలి. వీటి ఆధారంగానే టిఎఎఫ్‌ఆర్‌సీ ఈ విద్యాసంవ‌త్సరానికి సంబంధించిన‌ ఫీజుల‌ను ఖరారు చేస్తుంది. రాష్ట్రంలో వివిధ‌ వృత్తి విద్యా కోర్సులకు వచ్చే మూడేళ్లపాటు అమలు చేయాల్సిన ఫీజుల ఖరారుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) షెడ్యూల్ విడుదల చేసింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Jan 2025 09:39AM

Photo Stories