Skip to main content

Ekalavya Model Residential Schools Admissions : తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్.. ఈ త‌ర‌గ‌తుల‌కే..

2025-26 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ సొసైటీ నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఆరోతరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.
Telangana ekalavya model residential schools admissions for sixth class

సాక్షి ఎడ్యుకేష‌న్: 2025-26 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ సొసైటీ నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఆరోతరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్క‌డ ఆరో త‌ర‌గ‌తిలో విద్యార్థులు ప్ర‌వేశం పొందేందుకు ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 ఏకలవ్య గురుకుల పాఠశాలల‌ను నిర్వహిస్తుండ‌గా, మొత్తం 1380 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వ‌చ్చే విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుద‌ల చేశారు.

GATE 2025 Exam Guidance: గేట్‌.. గెలుపు బాట!.. గేట్‌ పరీక్షకు లాస్ట్‌ మినిట్‌ ప్రిపరేషన్, రివిజన్ టిప్స్‌..

ద‌రఖాస్తులు.. ఎంపిక విధానం..

ఈ పాఠ‌శాల‌ల్లో విద్యార్థులు ప్ర‌వేశం పొందాలంటే, ద‌రఖాస్తులు చేసుకొని, ప్ర‌క‌టించిన తేదీన ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ త‌రువాత‌, వారు ద‌క్కించుకున్న ఉత్తీర్ణ‌త‌ను బ‌ట్టి ఎంపిక విధానం ఉంటుంది. ఈ ప్ర‌వేశాల‌కు ద‌రఖాస్తుల‌ను జనవరి 17వ తేదీ అంటే, రేప‌టి నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం అవుతుంది. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుల‌కు, మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకునేందుకు https://tsemrs.telangana.gov.in/more.php వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

Digital Teaching: హైటెక్‌ బోధన.. ఆన్‌లైన్‌ సాధన.. ఇక్క‌డ‌ విద్యలో అంతా టెక్నాలజీయే..

పాఠ‌శాల‌ల ప్రాంతాలు..

తెలంగాణలో ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, ఎల్లారెడ్డిగూడ- రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మర్రిమడ్ల-రాజన్న సిరిసిల్ల,సీరోల్-మహబూబాబాద్‌, ఇందల్వాయ్- నిజామాబాద్‌, గండులపల్లి- కొత్తగూడెం భద్రాద్రి, కల్వకుర్తి- భద్రాద్రి కొత్త గూడెం, పాల్వంచ, సిర్పూర్‌-అసిఫాబాద్‌, ఉట్నూర్‌-ఆదిలాబాద్, గుండాల-కొత్తగూడెం, బయ్యారం-మహబూబాబాద్‌, ఇంద్రవెల్లి- ఆదిలాబాద్, చర్ల-కొత్తగూడెం, దమ్ముగూడెం- కొత్తగూడెం, ములకలపల్లె-కొత్తగూడెం, సింగరేణి-ఖమ్మం, కొత్తగూడ -మహబూబాబాద్‌, గూడూర్-మహబూబాబాద్‌లో ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల జాబితా వాటి వివరాలను ఈ లింకు ద్వారా చూడొచ్చు. https://tsemrs.telangana.gov.in/schoolList.php

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 16 Jan 2025 05:15PM

Photo Stories