Andhra University: ఏయూలో ప్రారంభం కానున్న తరగతులు
Sakshi Education
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని మొదటి ఏడాదికి సంబంధించి పలు తరగతులు ప్రారంభం కానునట్లు ప్రకటిన. ప్రారంభోత్సవానికి తేదీ, తదితరులను వివరించారు.
Classes start for students in Andhra University for some courses
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్ర విశ్వవిద్యాలయం బీటెక్, బీఆర్క్, ఎంటెక్, ఎంఆర్క్, ఎంసీఏ, ఎమ్మెస్సీ ప్రథమ సంవత్సరం తరగతులు ఈ నెల 30న ప్రారంభించనున్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులనుద్దేశించి ఏయూ వీసీ పి.వి.జి.డి ప్రసాదరెడ్డి ప్రసంగిస్తారు.
అనంతరం తరగతులను లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రవేశం పొందిన విద్యార్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు కన్వెన్షన్ సెంటర్‌కి చేరుకోవాలని ప్రిన్సిపాల్ శశిభూషణరావు సూచించారు. 29న తమ విభాగంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. 28నుంచి హాస్టల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు.