Degree Semester Exams: ఎస్కేయూ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు.. ఎప్పటి వరకు?
అనంతపురం: ఎస్కేయూ పరిధిలో మంగళవారం డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 29 వరకు పరీక్షలు జరగనున్నాయని డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. 42,836 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేశారు. రెండో సెమిస్టర్‌లో రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు 15,703 మంది, నాలుగో సెమిస్టర్‌కు 14,436, ఆరో సెమిస్టర్‌కు 12,697 మంది దరఖాస్తు చేశారు.
Hindi Radio Broadcast: ఇక్కడ తొలిసారి హిందీ రేడియో ప్రసారాలు ప్రారంభం
రెండో సెమిస్టర్ (న్యూ రెగ్యులేషన్స్) పరీక్షలు ఈ నెల 23 నుంచి మే 15 వరకు, పాత రెగ్యులేషన్స్ ఈ నెల 23 నుంచి మే 29 వరకు జరుగుతాయి. నాలుగో సెమిస్టర్ (న్యూ, ఓల్డ్ రెగ్యులేషన్స్) పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తారు. ఆరో సెమిస్టర్ (న్యూ రెగ్యులేషన్స్) పరీక్షలు ఈ నెల 23 నుంచి మే 20 వరకు, పాత రెగ్యులేషన్స్ పరీక్షలు ఈ నెల 23 నుంచి మే 15 వరకు జరుగుతాయి.
Tags
- Degree Semester Exams
- Shri Krishnadevaraya University
- exams schedule
- semester exams dates
- Director of Evaluations Professor GV Ramana
- number of students in semester exams
- degree supplementary exam dates
- semester wise exam dates
- Education News
- Sakshi Education News
- ananthapur news
- semester exams
- sku degree
- exam schedule
- Time Table