Skip to main content

TS Inter Results 2024 Release Date : ఈసారి ముందుగానే ఇంటర్ ఫలితాలు విడుద‌ల‌.. ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌లే తెలంగాణలో ఇంటర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ముగిసాయి. అలాగే ఈ ప‌బ్లిక్‌ పరీక్షల పేప‌ర్‌ వాల్యూయేషన్ వేగవంతంగా జ‌రుగుతుంది. ఈ సారి భారీగా ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం క‌లిపి మొత్తం 9 లక్షలకు మందికిపైగా విద్యార్థులు ప‌రీక్ష‌లు రాశారు.
Paper Valuation in Progress   Telangana Inter Results 2024 Details   Telangana Inter Public Examinations

ఇందులో 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. అలాగే  4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు.

 Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

ఏప్రిల్ నెల‌లో..
ఈసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తి చేసి.. ఫలితాలను కూడా త్వరగా వెల్ల‌డించ‌నున్నారు. ఈసారి ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

☛ Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!

ఇంట‌ర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఇలా..
ఇప్ప‌టికే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. మూల్యాంకన ప్రక్రియను మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే మొదటి విడత వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి అయింది. ప్రస్తుతం రెండో విడత వాల్యూయేషన్ నడుస్తుంది. ఈ నెలాఖారులోపు నాలుగు విడుతలను పూర్తి చేసేలా ప్లాన్ రూపొందించారు అధికారులు. జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది.

చదవండి: Offbeat Career Options: మెడిసిన్, ఇంజనీరింగ్‌ రంగాలకు దీటుగా ఆఫ్‌బీట్‌ కెరీర్స్‌

గత ఏడాదితో పోల్చితే.. ఈసారి..
పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే.. మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే.. ఈసారి సాధ్యమైనంత త్వరగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

చ‌ద‌వండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!

ఎంసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.. వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే నెల మూడో వారం లేదా చివరి వారంలో పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలకు సంబంధించి తుది ప్రకటన ఇంటర్ బోర్డు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంది.

చ‌ద‌వండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

Published date : 20 Mar 2024 04:02PM

Photo Stories