Offbeat Career Options: మెడిసిన్, ఇంజనీరింగ్ రంగాలకు దీటుగా ఆఫ్‌బీట్ కెరీర్స్
ఈవెంట్ ప్లానర్
సృజనాత్మకత, నిర్వహణ నైపుణ్యాలున్నవారు ఈవెంట్ ప్లానర్ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. వీరు క్లయింట్ బడ్జెట్, ప్రాధాన్యత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివాహాలు, పుట్టినరోజు పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్‌లను నిర్వహిస్తారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఫుల్‌టైమ్ ప్లానర్‌గా లేదా క్లయింట్‌ల కోసం ఫ్రీలాన్స్ ఈవెంట్ ప్లానర్‌గా పనిచేయవచ్చు.
- విద్యార్హతలు: ఈవెంట్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
- కావాల్సిన నైపుణ్యాలు: ఆర్గౖ¯ð జింగ్, నెట్‌వర్కింగ్, సహనం, సమస్య పరిష్కారం, కమ్యూనికేషన్, సృజనాత్మకత తదితర స్కిల్స్ తప్పనిసరి.
టీ టేస్టర్
చాలామంది టీ తాగుతారు. కానీ టీ రుచి చూడటాన్ని కూడా కెరీర్‌గా మలచుకోవచ్చని చాలా తక్కువ మందికే తెలుసు. పేరులో ఉన్నట్లుగానే టీ టేస్టర్‌లు వివిధ రకాల టీలను రుచి చూడటం, నాణ్యతను అంచనా వేయడం, నమూనాలు తీసుకుని టీలను వేరు చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. తయారీ కంపెనీలు,ఫైవ్ స్టార్ ప్రాపర్టీలు, టీ బోర్డ్ ఆఫ్ ఇండియాల్లో వీరికి మంచి అవకాశాలుంటాయి.టీ మిశ్రమాలను రూపొందించడంలో, కొత్త రకాలను ఉత్పత్తి చేయడంలో అనుభవం ద్వారా టీ టేస్టింగ్ కన్సల్టెన్సీ సేవలు సైతం అందించొచ్చు.
- విద్యార్హతలు: ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ. లేదా టీ రుచి,నాణ్యత, రకాలు, మార్కెటింగ్‌లో డిప్లొమా కోర్సు ఉండాలి.
- కావాల్సిన నైపుణ్యాలు: కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యం, విశేషమైన రుచిని పసిగట్టే నైపుణ్యాలు, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, టీ పరిశ్రమపై పరిజ్ఞానం ఉండాలి.
చదవండి: Fine Arts Career After Inter: ఫైన్ ఆర్ట్స్‌తో కలర్‌ఫుల్ కెరీర్
పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్
ఫిటినెస్, ఆరోగ్యం పట్ల మక్కువ ఉన్నవారికి ఈ కెరీర్ నిస్సందేహంగా సరైనదే. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలనుకునే వ్యక్తులకు పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌లు.. వ్యాయామం, ఆహార ప్రణాళికలను రూపొందిస్తారు. ఇవి వారి ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడతాయి. జిమ్‌లు, ఆరోగ్య కేంద్రాలు, కార్పొరేట్ సెటప్‌లు, ప్రైవేట్ గృహాల్లో ఫిట్‌నెస్ ట్రైనర్‌లకు విస్తృత అవకాశాలున్నాయి. ఆ¯Œ లైన్ వ్యాయామ పాఠాలు, పోషకాహార సూచనలు అందిస్తూ.. ఇంటి నుంచే నచ్చిన వేళల్లో పనిచేయొచ్చు.
- విద్యార్హతలు: న్యూట్రిషన్, ఫిట్‌నెస్‌లో డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో సర్టిఫికేషన్ కోర్సు ఉండాలి.
- నైపుణ్యాలు: కమ్యూనికేషన్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫిట్‌నెస్, న్యూట్రిషన్‌పై పరిజ్ఞానం, మోటివేషన్ తదితర నైపుణ్యాలు తప్పనిసరి.
చదవండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్
ట్రావెలింగ్, ఫొటోగ్రఫీలపై ఆసక్తి ఉన్నవారు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ ఎంచుకోవచ్చు. ఈ ఫొటోగ్రఫీలో భాగంగా వివిధ దేశాల్లో మొక్కలు, జంతువులు, ప్రకృతి దృశ్యాలను కెమెరాతో చిత్రీకరించడానికి అనేక ప్రదేశాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. కెమెరా లెన్స్ ద్వారా తీసిన చిత్రాలతో వీక్షకుల్లో అనేక రకాల భావోద్వేగాలను రేకెత్తించగలుగుతారు. చాలామంది వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌లు ఫ్రీలాన్సర్‌లుగా పని చేస్తారు. వన్యప్రాణుల కంటెంట్‌ను ప్రచురించే/ప్రసారం చేసే మీడియాలో ఫుల్‌టైమ్ ఉద్యోగిగా కూడా అవకాశాలు అందుకోవచ్చు.
- విద్యార్హతలు: ఫొటోగ్రఫీ, మెరైన్, నేచురల్ ఫొటోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో సర్టిఫికేషన్ కోర్సు ఉండాలి.
- నైపుణ్యాలు: వైల్డ్‌లైఫ్, ప్రకృతి పట్ల మక్కువ, ఫొటోగ్రఫీలో బలమైన సాంకేతిక నైపుణ్యాలు, అత్యంత సహనం ఉండాలి.
చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!
వీడియో గేమింగ్
ఎక్కువగా వీడియో గేమ్‌లు ఆడేవారు, వీడియోగేముల్లోని సృజనాత్మకతకు ముగ్దులై, వాటిపట్ల ఆసక్తి పెంచుకునేవారు వీడియోగేమర్‌గా తమ కెరీర్‌ను మలచుకోవచ్చు. అధునాతన గేమింగ్ టెక్నాలజీలతో కథ చెప్పే కళను మిళితం చేయగలిగితే గేమింగ్ ప్రపంచంలో దూసుకెళ్లొచ్చు. నిరంతరం నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా గేమింగ్ పోటీ ప్రపంచంలో అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
- విద్యార్హతలు: కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా గేమ్ డిజైనింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి.
- నైపుణ్యాలు: సృజనాత్మకత, సమస్య-పరిష్కార నైపుణ్యాలు, çసహకరణ సామర్థ్యం, సమయ నిర్వహణ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు.