Fine Arts Career After Inter: ఫైన్ ఆర్ట్స్‌తో కలర్‌ఫుల్ కెరీర్
- ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలు
- ప్రకటన విడుదల చేసిన జేఎన్‌ఏఎఫ్‌ఏయూ
హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ.. ఫైన్ ఆర్ట్స్ కోర్సులను అందిస్తోంది. బ్యాచిలర్ స్థాయిలో బీఎఫ్‌ఏలో పెయింటింగ్, అప్లయిడ్ ఆర్ట్స్, స్కల్ప్‌చర్, ఫోటోగ్రఫీ, యానిమేషన్ కోర్సుల్లో ఈ యూనివర్సిటీ ప్రవేశాలు కల్పిస్తోంది. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఏడీఈఈ)ని నిర్వహించనుంది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
పరీక్ష ఇలా
- అప్లయిడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్‌చర్ అండ్ యానిమేషన్ కోర్సులకు పేపర్-ఏలో మెమొరీ, డ్రాయింగ్, కలరింగ్ విభాగాల్లో 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఏదైనా అంశాన్ని ఇస్తారు. దానికి దృశ్య రూపాన్ని ఇవ్వాలి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
- పేపర్-బీ ఆబ్జెక్టివ్ తరహాలో 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 50 నిమిషాలు. ఇందులో జీకే, కరెంట్ అఫైర్స్-15 ప్రశ్నలు, ఇంగ్లిష్-15 ప్రశ్నలు, జనరల్ ఆర్ట్ ఓరియంటెడ్ 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
- పేపర్ సీ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్‌లో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషా లు. ఇందులో భాగంగా ఏదైనా వస్తువు లేదా బొ మ్మ చూపుతారు. ఆ దృశ్యాన్ని పెన్సిల్‌తో గీసి,దాని చూట్టూ పరిసరాలను ఊహించి వర్ణనాత్మక చిత్రా న్ని రూపొందించాలి. ఇందులో చిత్ర నైపుణ్యాలు, ఊహ, పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది.
చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!
ఫోటోగ్రఫీ కోర్సుకు
కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇందులో డ్రాయింగ్, కంపోజిషన్ నైపుణ్యాలు పరిశీలిస్తారు. పెన్సిల్‌తో ఇచ్చిన చిత్రాలకు షేడ్‌లు ఇవ్వాలి. అక్కడున్న చిత్రాలను క్రమ పద్ధతిలో అమర్చాలి. ఏదైనా అసంపూర్ణ దృశ్యం ఇచ్చి.. దాని చూట్టు ఉండే అవసరమైన ఇతర అంశాలను అందులో చేర్చి తీర్చిదిద్దమంటారు. వీటన్నింటికీ పరీక్షలో ప్రాధాన్యం ఉంటుంది. మరో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 50 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 50 నిమిషాలు. ఇందులో జీకే, కరెంట్ అఫైర్స్ 15, ఇంగ్లిష్ 15, జనరల్ ఆర్ట్ ఓరియంటెడ్ 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
ఇంటీరియర్ డిజైన్‌లోనూ
ఈ పరీక్షను 200 మార్కులకు 3 గంటల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో జీకే, కరెంట్ అఫైర్స్-20, కమ్యూనికేషన్ స్కిల్స్-50, ఇలస్ట్రేటివ్, అనలిటికల్ అండ్ డిజైన్ ఎబిలిటీ 50, మెమొరీ డ్రాయింగ్-30, కలర్ కో ఆర్డినేషన్ 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
చదవండి: Film Industry: సినీ రంగంలో కెరీర్ అవకాశాలు.. నైపుణ్యాలు, అర్హతలు..
ఉద్యోగావకాశాలు
ఆయా ఫైన్ ఆర్ట్స్ కోర్సుల ఉత్తీర్ణులకు నైపుణ్యాలుంటే.. విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్ట్ స్టూడియోలు, అడ్వరై్టజింగ్ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్ సంస్థలు, ఎలక్ట్రానిక్, టెక్స్‌టైల్ పరిశ్రమ, ఫిల్మ్ అండ్ థియేటర్, మల్టీమీడియా, యానిమేషన్..తదితర సంస్థలో ఉద్యోగాలు ఇస్తున్నాయి. గ్యాలరీల్లో వీరు తమ ప్రతిభను చూపించవచ్చు. ఫోటోగ్రఫీ చేసినవారికి ఉపాధికి కొదవలేదు. వీరికి ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధికి కూడా అవకాశం ఉంటుంది.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.06.2023
- రూ.200 లేట్ ఫీజుతో దరఖాస్తు చివరి తేదీ: 12.06.2023
- వెబ్‌సైట్: https://jnafauadmissions.com