NATA Exam Tips: కెరీర్ ఆర్కిటెక్చర్ వయా నాటా.. పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్ ఇలా!

కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వందల ఏళ్ల నుంచి మనుగడలో ఉంది. ఎన్నో చారిత్రక కట్టడాలు, వాటిలో ఇమిడి ఉన్న నిర్మాణ నైపుణ్యాలే అందుకు నిదర్శనం. ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా ఆర్కిటెక్చర్ విభాగంలో నిపుణులను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయిదు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థ.. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ సంస్థ జాతీయ స్థాయిలో ఆర్కిటెక్చర్ విద్య, ఇన్‌స్టిట్యూట్స్ విషయంలో నియంత్రణ వ్యవస్థగా వ్యవహరిస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీ.ఆర్క్) కోర్సులో ప్రవేశాలకు నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) పేరిట ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది.
నాటా మార్గం
బీ.ఆర్క్ కోర్సు అభ్యర్థులకు ప్రస్తుతం చక్కటి మార్గంగా నిలుస్తోంది.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా). ఈ టెస్ట్‌లో స్కోర్ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన అన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో బీ.ఆర్క్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. తాజా సమాచారం ప్రకారం–ప్రస్తుతం జాతీయ స్థాయిలో 450కు పైగా ఇన్‌స్టిట్యూట్‌లు నాటా స్కోర్ ఆధారంగా బీ.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
చదవండి: ఇంటి వద్దే ఆర్కిటెక్చర్ కోర్సుల ప్రవేశ పరీక్ష.. సమాచారం తెలుసుకోండిలా..
అర్హతలు
ఎంపీసీ గ్రూప్‌లో 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి లేదా.. మూడేళ్ల డిప్లొమాలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 2025లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండు విభాగాలు.. 200 మార్కులు
నాటా–2025ను రెండు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. మొదటి విభాగం పార్ట్–ఎలో.. డ్రాయింగ్ అండ్ కంపోజిషన్ టెస్ట్‌లో భాగంగా.. కంపోజిషన్ అండ్ కలరింగ్(1 ప్రశ్న–25 మార్కులు); స్కెచింగ్ అండ్ కంపోజిషన్–బ్లాక్ అండ్ వైట్ (1 ప్రశ్న– 25 మార్కులు), 3డి కంపోజిషన్ (1 ప్రశ్న – 30 మార్కులు) విభాగాలు ఉంటాయి. మొత్తం 80 మార్కులకు పార్ట్–ఎ ఉంటుంది.
- రెండో విభాగం.. పార్ట్–బిలో విజువల్ రీజనింగ్, లాజికల్ డెరివేషన్, జీకే అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటేషన్, డిజైన్ సెన్సిటివిటీ, డిజైన్ థింకింగ్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.
- ఇలా పార్ట్–ఎ, పార్ట్–బి రెండూ కలిపి 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పార్ట్–ఎను ఆఫ్‌లైన్ టెస్ట్‌గా, పార్ట్–బిని ఆన్‌లైన్ టెస్ట్‌గా నిర్వహిస్తారు.
- బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఎంసీక్యూస్), మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్ (ఒకటి కంటె ఎక్కువ సమాధానాలు ఉండే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు), న్యూమరికల్ టైప్ కొశ్చన్స్, ప్రిఫరెన్షియల్ ఛాయిస్, మ్యాచ్ ద ఫాలోయింగ్ తరహాలో ఉంటాయి.
ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ
నాటాలో నిర్దిష్ట కటాఫ్ మార్కులతో స్కోర్ సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు చేస్తారు.ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న కళాశాలల ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది.
చదవండి: నిత్యనూతన కెరీర్ ‘నిర్మాణం’.. ఆర్కిటెక్చర్
విస్తృత అవకాశాలు
నాటా స్కోర్ ద్వారా సీఓఏ గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌లో అయిదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరి పూర్తి చేసుకున్న వారికి ప్రైవేట్, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రైల్వే, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, నేషనల్ బిల్డింగ్, ఆర్గనైజేషన్స్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తదితర ప్రభుత్వ, అనుబంధ విభాగాల్లో కొలువులు లభిస్తాయి. అదే విధంగా ప్రైవేట్ రంగంలో గ్రాఫిక్, ఇంటీరియర్ డిజైన్, ఫర్నిచర్ డిజైన్ వంటి సంస్థల్లో, నిర్మాణ రంగంలోని కార్పొరేట్ సంస్థల్లో సగటున రూ.అయిదు లక్షల వార్షిక వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభం: 2025 ఫిబ్రవరి 3 నుంచి
- మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో నిర్దేశిత శుక్ర, శనివారాల్లో పరీక్ష ఉంటుంది.
- అభ్యర్థులు తమకు నచ్చిన సెషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షకు హాజరైతే ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nata.in
![]() ![]() |
![]() ![]() |

మెరుగైన స్కోర్‌కు మార్గాలివే
విశ్లేషణ, పరిశీలనను పరీక్షించేలా
నాటాలో అభ్యర్థుల సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణను పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో డైనమిక్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, సిట్యుయేషనల్ జడ్డ్‌మెంట్, లాజికల్ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
డ్రాయింగ్ అండ్ కంపోజిషన్
ఈ విభాగంలో అభ్యర్థుల సృజనాత్మకత, ఊహాత్మక దృష్టిని పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. నిర్దిష్టంగా ఒక ఒక సందర్భాన్ని, సన్నివేశాన్ని ఊహించి, విశ్లేషించి సమాధానాలు ఇవ్వాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి. స్కెచ్ విజువౖలైజేషన్, క్రియేటివిటీ, స్కేల్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్, జియోమెట్రిక్ కంపోజిషన్, బిల్డింగ్ ఫామ్స్, ఎలిమెంట్స్, కలర్ టెక్స్చర్, హార్మోనీ అండ్ కాంట్రాస్ట్, డ్రాయింగ్ ఆఫ్ ప్యాట్రన్, ఫామ్ ట్రాన్‌ఫర్మేషన్స్, ఇన్ 2డీ, 3డీ, సబ్‌స్ట్రాక్షన్, రొటేషన్, సర్ఫేసెస్ అండ్ వాల్యుమ్స్, జెనరేటింగ్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
కంపోజిషన్ ఆఫ్ కలర్
ఇందులో ఆయా సందర్భాలు, సన్నివేశాలకు అనుగుణంగా.. ఊహా చిత్రాలను రూపొందించేందుకు.. ఆకర్షణీయమైన కలర్ కాంబినేషన్స్‌ను వినియోగించే నైపుణ్యాలను పరీక్షిస్తారు.
స్కెచింగ్, కంపొజిషన్
ఈ విభాగంలో అభ్యర్థులకు నిర్దిష్టంగా ఒక సందర్భం, సన్నివేశాన్ని తెలియజేస్తారు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు ఆయా భవనాల ఊహా చిత్రాలను గీయాల్సి ఉంటుంది. స్కేల్, ప్రపోర్షన్స్, టెక్స ్చర్స్, షాడోస్, షేడ్స్ వంటి వాటిని విశ్లేషించాల్సి ఉంటుంది.
న్యూమరికల్ ఎబిలిటీ
పార్ట్–బిలో.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, కాలిక్యులస్స్, ఇంటీజర్స్ వంటి మ్యాథమెటిక్స్ అంశాలపై దృష్టి పెట్టాలి. ఫిజిక్స్‌కు సంబంధించి ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, రే ఆప్టిక్స్, రేడియేషన్, ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ వంటి ముఖ్యాంశాలపై పట్టుసాధించాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థుల్లోని సృజనాత్మక, పరిశీలనాత్మక దృక్పథం, ఆర్కిటెక్చర్‌పైన ఉన్న అవగాహన, ఇమాజినేషన్, ఆయా సబ్జెక్ట్‌లపై వారికున్న, ప్రతిభ నైపుణ్యాలను పరీక్షిస్తారు.
Tags
- Career Architecture
- National Aptitude Test in Architecture
- NATA
- Job and career architecture
- Work & Career Architecture
- NATA 2025
- What is NATA
- Best Architecture Colleges in India
- Career architecture via nata syllabus
- Career architecture via nata salary
- Career architecture via nata eligibility
- NATA exam syllabus
- NATA Entrance Exam Preparation
- NATA Study Plan 2025
- How to Prepare for NATA 2025
- NATA 2025 Preparation
- Crack NATA 2025 Exam
- NATA preparation books
- NATAExamPattern
- StudyForNATA