Skip to main content

AP Inter Public Exam Results Date 2024 : ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల..ఎప్పుడంటే..? ఈ సారి ముందుగానే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఇంట‌ర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు.
Inter Public Examinations Centers across Andhra Pradesh   10,52,221 Inter students in Andhra Pradesh   AP Inter Public Exam Results Details    Andhra Pradesh Inter-Public Examinations 2024

ఇందులో మొదటి  సంవత్సరం 4,73,058 మంది, రెండో  సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఇంటర్మీడియెట్‌ థీయరీ పరీక్షలు ముగియడంతో.. మూల్యాంకన ప్ర‌క్రియ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 4వ తేదీలోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేలా బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

☛☛ TS Inter Results 2024 Release Date : ఈసారి ముందుగానే ఇంటర్ ఫలితాలు విడుద‌ల‌.. ఎప్పుడంటే..?

అందువల్ల వాల్యుయేషన్ చెయ్యడం..

results

ఈ వాల్యుయేషన్ ప్రక్రియలో సుమారుగా 23వేల మంది అధ్యాపకులు  పాల్గొంటున్నారు. ఒక్కో అధ్యాపకుడూ రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఈ లెక్కన రోజూ 8 గంటల పాటూ వాల్యుయేషన్ చేస్తే.. గంటకు 4 పేపర్లను పరిశీలించాల్సి ఉంటుంది. అంటే పావు గంటకు ఒక పేపర్ పూర్తవ్వాలి. ఇది కొంతవరకూ సాధ్యమే. ఐతే.. విద్యార్థులు ఈ రోజుల్లో తెగ రాస్తున్నారు. విపరీతమైన పోటీలో.. ఎడిషన్ల మీద ఎడిషన్లు తీసుకొని రాస్తున్నారు. అందువల్ల వాల్యుయేషన్ చెయ్యడం అంత ఈజీ కాదనే వాదన ఉంది. అయినా అధ్యాపకులు మాత్రం చకచకా పని కానిస్తున్నారు.

చ‌ద‌వండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

 Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

రిజల్ట్స్ తెలుసుకునేందుకు..

results

ఏప్రిల్ 4తో వాల్యుయేషన్ అయిపోతుంది కాబట్టి.. ఆ తర్వాత ఎప్పుడైనా ఫలితాలు వెల్లడి చేసే ఛాన్స్ ఉంది. ఎలాగూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు చాలా టైమ్ ఉంది కాబట్టి.. ఫలితాల వెల్లడికి.. ఎన్నికలు అడ్డు కావు. అందువల్ల విద్యార్థులు మరో 2 వారాల్లో రాబోయే రిజల్ట్స్ తెలుసుకునేందుకు రెడీ అవ్వాలి. అంటే ఏప్రిల్ 3వ వారం లేదా 4వ వారం ఖచ్చితంగా ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. ఈ సారి ఏపీ ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఒకేసారి విడుద‌ల చేసే అవ‌కాశం.

How to check AP Inter Results 2024 :

  • On the result date, visit sakshieducation.com.
  • Click on AP Inter 1st year results / Ap Inter 2nd year results link available on the home page.
  • You can select General or vocational links.
  • Enter your hall ticket number and submit.
  • The results will be displayed.
  • Download and save a copy for further use.

చదవండి: Offbeat Career Options: మెడిసిన్, ఇంజనీరింగ్‌ రంగాలకు దీటుగా ఆఫ్‌బీట్‌ కెరీర్స్‌

☛ Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!

Published date : 21 Mar 2024 10:07AM

Photo Stories