Skip to main content

Food Poison: మాగనూరు ఫుడ్‌పాయిజన్‌పై హైకోర్టు సీరియస్‌

సాక్షి,హైదరాబాద్‌:నారాయణపేట జిల్లా మాగనూరు ఫుడ్‌పాయిజన్‌ ఘటనపై హైకోర్టు సీరియస్‌ అయింది. ఈ విషయంలో ఫైల్‌ అయిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(నవంబర్‌ 27) విచారించింది.
tg high court serious food poison cases govt schools

పిల్లలు చనిపోయినా కానీ స్పందించరా అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని హైకోర్టు సీరియస్‌ అయింది. వారంలో మూడు సార్లు ఫుడ్‌పాయిజన్‌ అవడం ఏంటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అంతకుముందు లగచర్ల, దిలావర్పూర్ రైతులకు సంబంధించిన పోరాటంపై కూడా కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..  దిలావర్ పూర్ లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి.. వెంటనే లగచర్లలో..  అల్లుడి కోసం.. ఆదానీ కోసం..  
ఇండస్ట్రియల్  కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి..
అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలి.. అక్కడ శాంతిని నెలకొల్పాలి.

చదవండి: TS CETs 2025: త్వరలో సెట్‌ల తేదీలు వెల్లడి.. ఏ సెట్‌ బాధ్యత ఎవరికి?

ఢిల్లీలో రైతుల సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు దేశ ప్రధాని కూడా చివరికి వెనక్కి తగ్గిన  చరిత్ర మన కళ్ళ ముందు ఉంది..

అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో లడాయికి కారణమైన రేవంత్ రెడ్డి.. తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్ లో  ఇథనాల్ మంటలను రాజేశారు.

తలకు మాసిన ఆలోచనలతో రేపు రేవంత్ ఏ జిల్లాలోని.. ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుస్తారోననే భయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరిలో వ్యక్తం అవుతుంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం.. వారి మనోభావాలను గౌరవించడం అనేది పాలకుడి ప్రాథమిక విధి. ఈ విషయాన్ని గుర్తెరిగి వెంటనే నిర్మల్ తరహాలోనే.. సొంత నియోజకవర్గంలో లగచర్ల సమరానికి ఫుల్ స్టాప్ పెట్టాలి..  తప్పు ఒప్పుకుని వెనక్కి తగ్గినంత  మాత్రాన సీఎం రేవంత్ రెడ్డి కిరీటం ఏమీ పడిపోదు.. లేకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది..

Published date : 28 Nov 2024 12:51PM

Photo Stories