TS Inter Results 2024 Date : ఇందుకే మరింత వేగంగా ఇంటర్ పరీక్షల మూల్యాంకనం.. ఫలితాల విడుదల తేదీ ఇదే..!
ఈ ఇంటర్ పరీక్షల పేపర్ వాల్యూయేషన్ వేగంగా జరుగుతోంది. మూల్యాంకన ప్రక్రియను మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే రెండు విడతల వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం మూడో విడత వాల్యూయేషన్ నడుస్తోంది. ఈ నెలాఖారు లోపు నాలుగు విడుతల వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ఈ సారి బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండానే..
కనీసం స్పాట్ కేంద్రాల్లోకి అధ్యాపకులకు కూడా ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్‌లో నమోదు చేయాలని బోర్డు సూచించింది.
☛ After Inter Best Courses : ఇంటర్ తర్వాత.. బెస్ట్ కోర్సులు ఇవే..! ఈ కోర్సుల్లో జాయిన్ అయితే..
దాదాపు 9,22,520 విద్యార్థులు..
విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 9,22,520 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే..
గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు.
చదవండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!
పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను..
సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్‌లైన్‌లో ఫీడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ చివరి వారంలోనే ఫలితాలు విడుదల..?
ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
చదవండి: Inter Special: ఎంపీసీ.. అకడమిక్ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్!!
ఈ సారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9 లక్షలకు మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. మొత్తం కలిపి 9,22,520 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు.
☛ Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
ఈసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తి చేసి.. ఫలితాలను కూడా త్వరగా వెల్లడించనున్నారు. ఎంసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.. వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు.
☛ After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..
ఏపీలో మాత్రం ఇంటర్ పలితాల విడుదల ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా వేగంగా జరుగుతుంది. ఏపీలో ఏప్రిల్ 4 వరకు ఈ మూల్యాంకనం కొనసాగనుంది. ఏప్రిల్ రెండు లేదా మూడో వారాల్లోనే ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మంది అధ్యాపకులు ఇంటర్ విద్యార్ధుల వాల్యూయేషన్‌లో పాల్గొంటున్నారు. ఏపీలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా తెలంగాణలో కంటే.. ఏపీలోనే ముందుగా ఇంటర్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
Tags
- TS Inter Results 2024
- TS Inter 1st Year Results 2024 Update
- TS Inter 1st Year Results 2024 Update News in Telugu
- TS Inter 2nd Year Results 2024 Update
- TS Inter 2nd Year Results 2024 Update News in Telugu
- TS Inter 2nd Year Results 2024 News in Telugu
- ts inter results 2024 telugu news
- ts inter 1st year results 2024
- ts inter 1st year results 2024 date
- ts inter 2nd year results 2024 date
- ts inter 1st year exam paper valuation 2024
- ts inter 2nd year exam paper valuation 2024
- ts intermediate public exam results 2024
- ts intermediate public exam results 2024 news telugu
- ts inter 2nd year results 2024 release date
- ts results intermediate 2024 news telugu
- ts intermediate results 2024 release news
- ts inter results 2024 update telugu
- ts inter results 2024 details in telugu
- ts inter results 2024 date and time
- ts intermediate public exam results 2024 release date and time details