Skip to main content

TS Inter Results First Year Topper 2024: ఇంటర్‌ ఫలితాల్లో కామారెడ్డి విద్యార్థి ప్రతిభ.. 470కి 468 మార్కులు..

Charvita Success Story  TS Inter Results First Year Topper 2024  Telangana Inter Results  Valakonda Charvita Achievement

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అంతంపల్లికి చెందిన వలకొండ చర్విత సత్తా చాటింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో, ఎంపీసీలో ఆమెకు 470 మార్కులకు 468 మార్కులు వచ్చాయి.

ఇంగ్లీష్‌లో 99(థియరీ 79, ప్రాక్టికల్స్‌ 20), సంస్కృతంలో 99, మ్యాథ్స్‌ 1Aలో 75, మ్యాథ్స్‌ 1Bలో 75, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60 మార్కులు సాధించింది. దీంతో చర్విత ప్రతిభపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా ఈ సారి కూడా ఇంటర్‌ ఫలితాల్లో బాలురి కంటే బాలికలదే పైచేయిగా నిలిచారు.

ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 60శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండ్‌ ఇయర్‌లో 64 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్ట్‌ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా టాప్‌ ప్లేస్‌లో నిలవగా, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 
 

Published date : 24 Apr 2024 03:40PM

Photo Stories