Inter Syllabus Changes : ఇంటర్ సిలబస్‌లో మార్పులు.. బోర్డు కీలక నిర్ణయం.. అమలు ఇప్పుడంటే..!!

సాక్షి ఎడ్యుకేషన్: రోజురోజుకి పెరిగిపోతున్న ఈ టెక్నాలజీ, విద్యార్థుల నైపుణ్యాలు, ఇతర విషయాలు తెలుసుకోవాలన్ని విద్యార్థుల ఆసక్తి వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ఇంటర్‌లో ఉన్న సబ్జెక్స్‌లో కొన్నింటిని మినహాయించి దానికి బదులుగా మరికొన్ని విద్యార్థులకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పూరతి వివరాలను పరిశీలిద్దాం.
Education News : అదనపు ఇంజనీరింగ్ సీట్ల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కి దరఖాస్తులు
ఇంటర్ విద్యార్థులపై చదువుల భారం తగ్గించేందుకు ఇంటర్ బోర్డు తీసుకున్నా ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనుంది. ఇందులో భాగంగానే సిలబస్‌లో విద్యార్థులకు అవసరమైన పాఠాలను, వారికి ఉపయోగపడే పాఠాలనూ చేర్పాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్‌లో ఉన్న సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టుల్లోని సిలబస్‌లో మార్పులు ప్రారంభించారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తో పాటు జువాలజీ, బాటనీ సిలబస్‌ను తగ్గించాలని భావిస్తున్నారు.
APAAR Card : నీట్‌కు అపార్ తప్పనిసరి.. విద్యార్థులు ముందుగా చేయాల్సినవి ఇవే..
ఈ మార్పుల్లో భాగంగానే విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించేందుకు కొత్తగా వివిధ అంశాలను చేర్చడంపై దృష్టిపెట్టారు. ఇందులో, పెరుగుతున్న టెక్నాలజీకి సంబంధించినవి, గత కొద్ది రోజులుగా ట్రెండ్‌లో ఉన్న (విద్యార్థులకు ఉపయోగపడే) అంశాలు కావచ్చు.. లేదా కరోనా, ఇతర విషయాపై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఫిజిక్స్‌లో ఏఐ..
ఇంటర్ విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టులో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్, మిషన్ లర్నింగ్ వంటి వివిధ సాంకేతికతకు సంబంధించిన అంశాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిని, సెకండియర్‌లో సిలబస్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ఇలా, జువాలజీలో 'కొవిడ్' పాఠాన్ని అలాంటి వైరస్ లు వ్యాపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమాజంలోనూ ఎలాంటి అవగాహన కల్పించాలి? అనే అంశాలను సిలబస్‌లో చేర్చబోతున్నారు.
ఇలా, అనేక ఇంటర్ విద్యార్థులు తమలో ఎంతో భారాన్ని మోస్తున్న సమయంలో వారికి ఆ భారాన్ని తగ్గించి, వారికి ఉపయోగపడే విధంగా వారూ ఆసక్తి చూపించే అంశాల్లో వారికి పాఠాలను అందిస్తే ఇష్టంగా నేర్చుకుంటారని ఇంటర్ బోర్డు భావించింది. దీంతో, వారి భారం తగ్గుతుంది, వారిలో మరింత నేర్చుకోవాలన్న ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఇప్పుడు అమల్లోకి తెచ్చే అంశాలు ట్రెండింగ్‌లో ఉన్నందున విద్యార్థులు మరింత ఆసక్తితో నేర్చుకుంటారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Telangana inter board
- inter board decision
- inter syllabus changes
- students education
- students interest subjects
- telangana intermediate syllabus changes
- new academic year changes in inter
- technology development for inter syllabus
- covid awareness
- awareness subjects for inter students
- trending subjects for inter syllabus
- TS Education Department
- telangana inter 1st and 2nd year syllabus changes
- telangana intermediate syllabus changes for 2026
- Education News
- Sakshi Education News
- TelanganaStateInterBoard