Skip to main content

Inter Board Exam Fees : ఇంట‌ర్ బోర్డు ఎగ్జామ్ ఫీజు చెల్లింపుకు గ‌డువు పెంపు.. ఆల‌స్య రుసుంతో..

Telangana inter board exam fees date extends to january 25th   Inter Board extends exam fee payment deadline till 25th January with a late fee of Rs. 2500

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇంట‌ర్ విద్యార్థుల బోర్డు ప‌రీక్ష‌ల‌కు మ‌రో నెల నెల‌న్నర మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల్లో ఇప్ప‌టికీ ఫీజు క‌ట్ట‌నివారు ఉంటే, వారి మ‌రికొన్ని రోజుల‌ను పెంచింది బోర్డు. ఫైర్ సెఫ్టీ లేని కాలేజీల విజ్ఞప్తి మేరకు ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపుకు ఇచ్చిన గడువును పొడిగించింది ఇంట‌ర్ బోర్డు. ఈ మెర‌కు విద్యార్థుల్లో ఎగ్జామ్ ఫీజు క‌ట్ట‌నివారు ఈనెల 25వ తేదీ అంటే, శ‌నివారం వ‌ర‌కు ఫీజు క‌ట్ట‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది ఇంట‌ర్ బోర్డు. అయితే, విద్యార్థులు ఈ ఫీజును ఆల‌స్యంగా చెల్లిస్తుండ‌గా వారు రూ. 2500 ఫైన్​తో ఫీజు చెల్లించాల‌ని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వివ‌రించారు.

Vocational Education Courses Fees : వృత్తి విద్య కోర్సుల ఫీజుల్లో మార్పులు.. ఈసారి 15 శాతం..!!

మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఫైర్ సేఫ్టే లేకుండా కొనసాగుతున్న కాలేజీలకు సర్కారు ఈ ఏడాదికి స్పెషల్ పర్మిషన్ను ఇచ్చింది. ప్రస్తుతం కొత్తగా 220 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకూ ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. దీంట్లో ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో చదువుతున్న 35 వేల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, వారంతా ప్ర‌క‌టించిన తేదీలోగా రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు రూల్స్​ ప్రకారం ఫైన్​తో ఫీజు చెల్లించాలని బోర్డు స్పష్టం చేసింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Jan 2025 03:54PM

Photo Stories