TS Inter Results 2024: కూలీ, రైతు బిడ్డలకు సరస్వతీ కటాక్షం
ఇద్దరు రైతు బిడ్డలు, ఓ కూలీ కుమార్తె టాప్ మార్కులు సాధించారు. కామారెడ్డి జిల్లా భిక్క నూరు మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ వలకొండ చర్విత ఓ ప్రైవేటు కాలేజీలో ఫస్టియర్ ఎంపీసీలో 470కి 468 టాప్ మార్కులు సాధించింది. అలాగే మహబూబాబాద్‌కు చెందిన చిన్నకారు రైతు నాగరాజు కుమార్తె పల్లె బోయిన ప్రణతి ఫస్టియర్ ఎంపీసీలో 470కి 468 టాప్ మార్కులు తెచ్చుకుంది.
హనుమకొండ జిల్లా దామెర మండలం తక్కళ్లపాడులో రోజు వారీ కూలీ చేసుకొని జీవనం సాగిస్తున్న మార్త సుధాకర్–లావణ్య దంపతుల కుమార్తె పావని కమలాపూర్‌లోని కేజీబీవీలో ఇంటర్ ఎంపీసీ ఫస్టి యర్‌లో 470కి 467 మార్కులు సాధించి టాప ర్లలో ఒకరిగా నిలిచింది.
చదవండి: Best Courses After Inter: ఇంటర్ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్ 100 కోర్సులు.. వాటి వివరాలు..
సివిల్స్‌కి ఎంపికై కలెక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చర్విత తెల పగా ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీటు సాధించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడమే లక్ష్యమని ప్రణతి చెప్పింది. సొంతంగా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించాలని ఉందని పావని ‘సాక్షి’కి తెలిపింది.
మరికొందరు ఆణిముత్యాలు
- సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ కోర్సు విద్యార్థి డి.సుకుమార్ ఈటీ విభాగంలో 994 మార్కులు సాధించాడు.
- రంగారెడ్డి జిల్లా కొందుర్గు కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) ఒకేషనల్ కోర్స్ చదివిన వింధ్య 983 మార్కులు సాధించింది.
- నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదు వుతున్న బైరి శ్రీనిధి ఫస్టియర్ ఎంపీసీలో ఏకంగా 470కి 468 మార్కులు తెచ్చుకుంది. ఇంజనీర్ కావలన్నదే తన లక్ష్యమని శ్రీనిధి చెప్పింది.
- రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరి« దిలోని అంతిరెడ్డిగూడకు చెందిన మెక్కొండ శ్రీనివాస్, శ్రీలత దంపతుల కూతురు మనోజ్ఞ ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతూ ఫస్టియర్ బైపీసీలో 440కి 438 మార్కులతో టాప్ మార్కులు తెచ్చుకుంది.
- నల్లగొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు జిల్లెపల్లి ప్రమోద్ ఎంపీసీ ఫస్టియర్‌లో 470కి 465 మార్కులు, కొక్కు విఘ్నేష్ 470కి 459 మార్కులు తెచ్చుకున్నారు.
- నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి చింతకింది గణేశ్–పద్మల కుమారుడు చింతకింది నాచికేత్ మీనన్ ఎంపీసీలో 470కి 466 మార్కులు సాధించాడు.