Skip to main content

TS Intermediate Admission 2025 : ఇంటర్‌లో ప్రవేశాలకు 24న స్పాట్‌ అడ్మిషన్లు

TS Intermediate Admission 2025 : ఇంటర్‌లో ప్రవేశాలకు 24న స్పాట్‌ అడ్మిషన్లు
TS Intermediate Admission 2025 : ఇంటర్‌లో ప్రవేశాలకు 24న స్పాట్‌ అడ్మిషన్లు

నల్లగొండ: చెర్వుగట్టులో నిర్వహిస్తున్న నకిరేకల్‌ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 24న స్పాట్‌ అడ్మిషన్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ మధుకర్‌ గురువారం తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులు 2024 మార్చిలో రాసిన పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలని, తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం అర్బన్‌లో రూ.రెండు లక్షల, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వరకు ఉండాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని అర్హత కలిగిన విద్యార్థులు స్పాట్‌ అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Also Read:  CISF Constable/ Fire Recruitment 2024: ఇంటర్‌ అర్హతతో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Published date : 23 Aug 2024 01:43PM

Photo Stories