Skip to main content

Inter Student Scores Highest: పార్ట్‌టైం జాబ్‌ చేస్తూనే ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థి.. కాని..!

ఇంటర్‌లో ఉత్తమ మార్కులను సాధించాడు ఈ విద్యార్థి. అయితే, తన చదువు సమయంలో ఇలా పార్ట్‌టైం జాబ్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇతని కథేంటో తెలుసుకుందాం..
TS Inter student with his part time job scores highest in board exam

ఇటీవలె విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటాడు ఈ విద్యార్థి. తన చదువులో ప్రతిభను చూపించి 957 మార్కులను సాధించాడు. ఇంతటి విజయాన్ని సాధించిన ఈ యువకుడు సిద్ధిపేటకు చెందిన బిలాలుద్దీన్‌. ఇది ఇతని కథ..

తల్లిదండ్రుల కష్టం..

చదువుకోవడం ఇష్టం.. చదివించడం కూడా ఇష్టం. కాని, ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా కొడుకుని ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి తల్లిదండ్రులు మాత్రం హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ ఒక ఫుట్‌పాత్‌ పైన ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. సిద్ధిపేటకు చెందిన ఒక యువకుని తల్లిదండ్రులు వీరు. అయితే, ఆ విద్యార్థి మాత్రం తన పెద్దమ్మ వద్దే ఉండి చదువును కొనసాగిస్తున్నాడు. పదో తరగతిలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో తెలిసి చాలా బాధ పడ్డాడు. ఆ క్షణంలోనే చదువును వదేయాలన్న ఆలోచన వచ్చింది.

పెద్దమ్మ ప్రోత్సాహంతోనే..

కాని, అప్పుడే తన పెద్దమ్మ తన నిర్ణయాన్ని అడ్డుకొని,  తమ ఇంట్లోనే ఉంటూ చదువును కొనసాగించాలని పెద్దమ్మ కోరింది. అంతేకాకుండా బిలాలుద్దీన్ ను సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ చేయించి ముందుకు నడిచేందుకు ప్రోత్సాహించింది. అయితే, తన పెద్దమ్మ పెద్ద మనసుతో ప్రోత్సహించినందుకు ఉత్తమ మార్కులు సాధించాలని బిలాలుద్దీన్ నిర్విరామంగా చదివేవాడు. ఎలాగైనా, ఇంటర్‌లో ఉత్తమ మార్కులను సాధించాలన్న పట్టుదల పెరిగింది.

పార్టైం జాబ్‌ చేస్తూ..

పెద్దమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటర్‌ ప్రారంభమైంది. పార్టైం జాబ్‌ చేయడం అవసరం లేదనుకున్నాను. కాని, అదే సమయంలో పెద్దమ్మ అనారోగ్యం పాలైంది. అందు వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నపాటి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలోనే ఓ వైద్యశాలలో చిన్నపాటి ఉద్యోగం దొరికింది.

Inter Ranker

అలా, ఒకవైపు ఉద్యోగం, మరోవైపు చదువును కొనసాగించాను. ఇక ఉదయం కాలేజీకి, సాయంత్రం ఉద్యోగానికి వెళ్ళే తీరును అలవాటు చేసుకున్నాడు కుర్రాడు. 

ఉత్తమ మార్కులతో సభాష్‌..

చదువుతోపాటు ఉద్యోగం కూడా చేసినప్పటికి పరీక్షల్లో మార్కులు తగ్గుతాయన్న భయం నిరంతరం ఉండేది. కాని, మా కళాశాలలో ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు నాకిచ్చిన ప్రోత్సాహం, నేర్పిన విద్య ఎప్పటికీ మరువలేనిది. కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల్లో విద్యను అందిస్తారని, వెననుకబడ్డ విద్యార్థులను ‍ప్రోత్సాహించి, ప్రత్యేకంగా చదువును నేర్పింస్తూ ముందుకు నడిపిస్తారని కళాశాల గురించి కొనియాడాడు బిలాలుద్దీన్‌..

తల్లిదం‍డ్రులతోపాటు..

కొడుకుని చదివించేందుకు ప్రతీ తల్లిదం‍డ్రులు కష్టపడుతూనే ఉంటారు. కాని, ఆ కష్టాన్ని గుర్తించాల్సింది పిల్లలు. అలాగే, ఇ‍క్కడ తన తల్లిదండ్రులు తమ ఊరిని దాటుకొని పట్టణానికి వచ్చి కష్టపడుతూ ఉండడం చూసిన వారి కొడుకు ఇలా వారితోపాటు చదువుకుంటూనే మరో ఉద్యోగం చేస్తూ సహాయపడడం చాలా గొప్ప విషయం కదా.. ఈ విషయాన్ని తెలుసుకున్నవారంతా ఈ విద్యార్థిని వారి తల్లిదం‍డ్రులను అభినందిస్తున్నారు. ఇంత కష్టపడూ కూడా ఇంటర్‌లో 957 మార్కులు సాధించిన బిలాలుద్దీన్‌ని జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Published date : 29 Apr 2024 04:40PM

Photo Stories