Skip to main content

Inter Results 2024 Release Date : ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌రం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మంది ఉపాధ్యాయులతో వాల్యూయేషన్ ప్రారంభించారు. ఇటీవ‌లే ఇంటర్‌ పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్ధుల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు.
ap inter results 2024  Andhra Pradesh Inter 1st and 2nd Year Answer Paper Evaluation Underway

ఏప్రిల్ 4 వరకు ఈ మూల్యాంకనం కొనసాగనుంది. ఏప్రిల్ రెండు, మూడో వారాల్లోనే ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మంది అధ్యాపకులు ఇంటర్ విద్యార్ధుల వాల్యూయేషన్‌లో పాల్గొంటున్నారు.

☛ Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!

☛ చదవండి: Software Jobs: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

దాదాపు 60 లక్షల జవాబు పత్రాలను..

.
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో 4 ఏప్రిల్, 2024 వరకు మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. సుమారు 23,000 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 60 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తారని వెల్లడించారు. ప్రతి కేంద్రంలో ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారని వివరించారు. ఫలితాలను ఏప్రిల్‌ నెలలోనే విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది.

☛ చదవండి: Offbeat Career Options: మెడిసిన్, ఇంజనీరింగ్‌ రంగాలకు దీటుగా ఆఫ్‌బీట్‌ కెరీర్స్‌..

How to check AP Inter 2024 Results :

  • On the result date, visit sakshieducation.com.
  • Click on AP Inter 1st year results / Ap Inter 2nd year results link available on the home page.
  • You can select General or vocational links.
  • Enter your hall ticket number and submit.
  • The results will be displayed.
  • Download and save a copy for further use.
Published date : 25 Mar 2024 01:42PM

Photo Stories