IIITDM Convocation: ట్రిపుల్ఐటీడీఎం విద్యార్థులకు 5వ స్నాతకోత్సవం
సాక్షి ఎడ్యుకేషన్: జగన్నాథగట్టుపై వెలసిన ట్రిపుల్‌ఐటీడీఎంలో 5వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఆచార్య డీవీఎల్‌ఎన్ సోమయాజులు, రిజిస్ట్రార్ ఆచార్య గురుమూర్తి తెలిపారు. గురువారం త్రిపుల్ ఐటీడీఎం సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్నాతకోత్సవానికి ఐఐటీ హైదరబాద్, ఐఐటీ రూర్కీ పాలక మండలి అధ్యక్షులు బీవీఆర్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారన్నారు.
AP SI of Police Final Exam 2023: ఎగ్జామ్ ప్యాటర్న్,సిలబస్ ఇదే... బిట్ బ్యాంక్ కోసం ఇక్కడ చూడండి!
భారతీయ సమాచార రూపకల్పన, తయారీ సంస్థ చైర్మన్ ఆచార్య హెచ్.ఏ రంగనాథ్ స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో 45, ఈసీఈలో 37, మెకానికల్‌లో 31 మందికి పట్టాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలో 300 సీట్లకుగాను జేఈఈ మెయిన్స్ ద్వారా 271 భర్తీ అయ్యాయని తెలిపారు. ఎంటెక్‌లో 21 మంది, పీహెచ్‌డీలో 19 మంది ప్రవేశాలు పొందారన్నారు. పరిశోధన విద్య విభాగంలో నాలుగేళ్లలో 30 ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని, వీటి విలువ రూ.6 నుంచి రూ.6.50 కోట్లు ఉంటుందన్నారు.
Guest Lecturer Posts: డిగ్రీ కాలేజీలలో అతిథి అధ్యాపకుల పోస్టులు
అక్టోబరు నాటికి అన్ని వసతులు
ట్రిపుల్‌ఐటీడీఎం 2015లో ఏర్పాటైందని, మొదట్లో రూ.256 కోట్లతో పనులు మొదలు పెట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 152 ఎకరాల భూమిని కేటాయించారని, ఇందులో 60 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం భవన నిర్మాణాలకు వినిగించుకుంటున్నామని పేర్కొన్నారు.
మిగిలిన 90 ఎకరాల్లో కొందరు రాత్రి వేళల్లో అక్రమంగా మట్టిని తరలించుకపోతున్నారని, ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకపోయామన్నారు. క్యాంపస్‌లో శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారానికి, రక్షణ గోడ నిర్మాణానికి, హైటెన్షన్ లైన్ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. అక్టోబరు ఆఖరి నాటికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు.