Autobiography Book Launch: ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆత్మకథ
Sakshi Education
’జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఆత్మకథ పుస్తకం హైదరాబాద్‌లో ఆవిశ్కరణ..
సాక్షి ఎడ్యుకేషన్: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ’జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. దీనిని ఏప్రిల్ 24న హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఐఏఎస్ అధికారిగా దువ్వూరి సుబ్బారావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో పనిచేశారు.
Aryabhatta Award: పావులూరి సుబ్బారావుకు 'ఆర్యభట్ట' అవార్డు
కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగానూ వ్యవహరించారు. ఆ తర్వాత అత్యున్నతమైన రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవి ఆయనను వరించింది. దేశం ఆర్థికంగా అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్ సమర్థంగా విధులు నిర్వర్తించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
Published date : 01 May 2024 11:37AM