ఒకే విద్యార్థి.. ఒకే ఉపాధ్యాయిని .. ఇదీ పరిస్థితి!
Sakshi Education
జహీరాబాద్: పేరుకది ప్రభుత్వ పాఠశాల.. ఒకే విద్యార్థి బడికి వస్తాడు.. ఏకైక ఉపాద్యాయిని ఆ విద్యార్థికి బోధిస్తారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మోడ్ తండా ప్రాథమిక పాఠశాల పరి స్థితి ఇది. ఈ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ప్రవేశం పొందగా.. ఒకటో తరగతి విద్యార్థి అఖిల్ మాత్రమే.. నిత్యం పాఠశాలకు వెళ్తున్నాడు. అదే తరగతికి చెందిన జయ్.. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నందున పాఠశాలకు హాజరు కావడం లేదు.
చదవండి: Mid Day Meal Share: బడుల్లో ‘మధ్యాహ్న భోజనం’ ఖర్చులో.. కేంద్ర.. రాష్ట్రాల.. వాటా ఎంతో తెలుసా?
ఐదో తరగతి విద్యార్థి ప్రకాశ్ పాఠశాలకు రాకుండా.. తండ్రి విజయ్‌నాథ్‌తో కలసి మేకలు మేపేందుకు వెళ్తున్నాడు. తండాకు చెందిన మరో ఐదుగురు విద్యార్థులు కిలోమీటర్ దూరంలోని అర్జున్‌నాయక్ తండా పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. దీంతో నిత్యం వస్తున్న ఒక్క విద్యార్థికే ఉపాధ్యాయిని శ్రీలత పాఠాలు బోధిస్తున్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 29 Jan 2025 03:09PM